ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి సురేశ్ మోహన్ తెలిపారు. పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామ పరిధిలో వరుసగా మూడో రోజు, అలాగే అమీన్పూర్ మండలం పటేల్ గూడ గ్రామపంచాయతీ పరిధిలోనూ అక్రమ నిర్మాణాలను కూల్చి వేశారు.
'అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవు'
పటాన్చెరు మండలంలోని పలు గ్రామాల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతను జిల్లా పంచాయతీ అధికారి సురేశ్ మోహన్ పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా ఉపక్షించేది లేదని హెచ్చరించారు. అనుమతులు లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేయకూడదని హెచ్చరించారు.
పటాన్చెరులో అక్రమ నిర్మాణాల కూల్చివేత, సంగారెడ్డి అక్రమ నిర్మాణాలు
ఈ కూల్చివేతలను డీఎల్పీవో సతీశ్ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇంద్రేశం, కృష్ణారెడ్డి పేట గ్రామాల్లో అక్రమ నిర్మాణాలు నివారించడంలో విఫలమైనందున సర్పంచ్, ఉప సర్పంచ్లకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:కొవిడ్ నిబంధనలు పాటించాలంటూ ప్రజల్లో అవగాహన