సంగారెడ్డి జిల్లా పటాన్చెరు టోల్గేట్ వద్ద రెండు వాహనాల్లో కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్న పౌరసరఫరాల బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు, పౌరసరఫరాల అధికారులు కాపుకాసి పట్టుకున్నారు. 131 క్వింటాళ్ల బియ్యాన్ని తీసుకు వెళ్తున్న నిజాముద్దీన్, సయ్యద్ ఫైజ్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని పౌరసరఫరాల గిడ్డంగికి తరలించారు. జప్తు చేసుకున్న వాహనాలను పోలీసు స్టేషన్కి పంపి, వారిపై కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు పంపారు.
అక్రమంగా తరలిస్తున్న బియ్యం పట్టివేత - బియ్యం
పటాన్చెరు టోల్గేట్ వద్ద పౌరసరఫరాల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను విజిలెన్స్ అధికారులు, పౌరసరఫరాల అధికారులు పట్టుకుని బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు పంపారు.
అక్రమంగా తరలిస్తున్న బియ్యం పట్టివేత