సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం చిరాగ్ పల్లి శివారులోని చెక్ పోస్టులో ప్రైవేటు ఏజెంట్‌ను కూర్చోబెట్టి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. తెలంగాణలో ప్రవేశించే లారీలు, పర్యాటక బస్సుల నుంచి 500 నుంచి 1000 వరకు అక్రమంగా వసూలు చేస్తున్నారని గుజరాత్‌కు చెందిన కేవల్ తనక్కీ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి వచ్చిన అనిశా అధికారి డీఎస్పీ డా. శ్రీనివాస్ నేతృత్వంలో అధికారులు దాడులు నిర్వహించి నగదు తీసుకుంటుండగా పట్టుకున్నారు.
చెక్‌పోస్టులో అక్రమ వసూళ్లు.. ఏసీబీకి పట్టుబడ్డ అధికారిణి.. - sangareddy district news
తెలంగాణ-కర్ణాటక రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులో అనిశా అధికారులు మెరుపు దాడులు చేశారు. డీఎస్పీ డా. శ్రీనివాస్ నేతృత్వంలో అధికారులు దాడులు నిర్వహించి రూ. 500 నగదు తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఇన్స్పెక్టర్ త్రివేణి బాయి నుంచి రూ. 28,470 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
చెక్‌పోస్టులో అక్రమ వసూళ్లు.. ఏసీబీకి పట్టుబడ్డ అధికారిణి..
ప్రతి అరగంటకొకసారి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ త్రివేణి బాయి, ప్రైవేట్ ఏజెంట్ వసూలు చేసిన మొత్తాన్ని తీసుకుంటుంది. తన టేబుల్డ్రాలో వేసుకున్న లెక్కచూపని రూ. 28,470 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు చేపట్టిన అనిశా అధికారులు త్రివేణి బాయి సహా ప్రైవేట్ ఏజెంట్ చాంద్ పాషాపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి : 'ఉద్యోగాల పేరుతో మహిళలు అక్కడ మగ్గిపోతున్నారు'