రాష్ట్ర వ్యాప్తంగా ఐకేపీ వీఓఏ ఉద్యోగుల నిరసనలు IKP VOA is Raising Concerns in Sangareddy : తమ సమస్యలు పరిష్కరించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఐకేపీ విలేజ్ ఆర్గనైజేష్ అసిస్టెంట్ల ఆందోళనలు చేస్తున్నారు. 36 రోజుల నుంచి వీఓఏలు వారి డిమాండ్లను నెరవేర్చాలంటూ నిరసనలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకునే వరకు నిరవధిక సమ్మెతో పాటు వినూత్నమైన కార్యక్రమాలను చేపట్టి.. నిరసనలు చేస్తామని తెలిపారు. ఈరోజు నిరవధిక సమ్మెలో భాగంగా వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడికి ప్రయత్నించిన వీఓఏలు : సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద సీఐటూయూ ఆధ్వర్యంలో వీఓఏలు ధర్నా నిర్వహించారు. అధికారులు బయటకు రాలేనందున కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. స్టేషన్‌కు తరలించేందుకు యత్నించారు. ఏపీడీ అధికారి బయటికి వచ్చి.. సమస్యను ఉన్నతాధికారులకు వివరిస్తానన్న హామీతో వీఓఏలు శాంతించారు.
సీఐటీయూ నేతల ఆధ్వర్యంలో నిరసనలు: నిర్మల్‌లో గాంధీ పార్కు నుంచి కలెక్టరేట్ వరకు వీఓఏలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పాలనాధికారి కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రధాన గేటుకు తాళ్లతో కట్టి ఎవరిని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇదే సమయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వాహనం అక్కడికి రాగా.. అడ్డుకుని లోనికి వెళ్లకుండా నిరసన తెలిపారు. అనంతరం స్పందించిన పోలీసులు వారిని అక్కడ నుంచి తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు సీఐటీయూ నేతలను, వీఓఏలను అదుపులోకి తీసుకుని.. వారిని అరెస్ట్ చేసి స్థానికి పోలీస్ స్టేషన్‌కి తరలించారు.
ఈ నిరసనలో భాగంగా పలు డిమాండ్లు చేశారు. అవి :
- వీఓఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి, ఉద్యోగ భద్రత కల్పించాలి.
- కనీస వేతనం రూ.26000లు ఇవ్వాలి.
- రూ.10 లక్షలు సాధారణ బీమా, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలి.
- ప్రతి మహిళ సంఘ సభ్యురాలికి రూ.5 లక్షలు సాధారణ బీమా సౌకర్యం కల్పించాలి.
- మహిళా సంఘాలకు రావాల్సిన అభయ హస్తం నగదు, ఇప్పటి వరకు ఇవ్వవల్సిన వీఎల్ఏ తిరిగి సంఘాలకు చెల్లించాలి.
- వీఓఏలకు సెర్ఫ్ నుంచి ఐడీ కార్డులు ఇవ్వాలి. గ్రేడింగ్‌కు సంబంధం లేకుండా ప్రతి నెల వీఓఏలకు వ్యక్తిగత అకౌంట్లోకి వేతనాలు జమ చేయాలి.
- అర్హులైన వీఓఏలను సీసీలుగా ప్రమోషన్స్ కల్పించాలి.
ఇవీ చదవండి: