తెలంగాణ

telangana

ETV Bharat / state

'పెళ్లి జరిపిస్తే ఓకే.. లేదంటే టవర్​ నుంచి దూకేస్తా' - CANDIDATE RAJU

ప్రేమించిన యువతితో తన పెళ్లి జరిపించాలని లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కాడు. ఇరు కుటుంబాలు తమ పెళ్లికి ఒప్పుకోవాలని కోరుతున్నాడు.

రాజు కిందకు దిగిరావాలి : కుటుంబ సభ్యులు

By

Published : Apr 1, 2019, 11:22 AM IST

Updated : Apr 1, 2019, 11:50 AM IST

ప్రేమించిన యువతితో పెళ్లి జరిపించకుంటే సెల్ టవర్ నుంచి దూకేస్తా : రాజు
సంగారెడ్డి జిల్లా కంది మండల తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో రాజు అనే వ్యక్తి సెల్ టవర్ ఎక్కాడు. రాజు, తన ఇంటి పక్కనే నివాసం ఉండే యువతి ఇద్దరూ ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. గత నెల ఇరువురూ ఇంట్లో నుంచి పారిపోయి తిరుపతిలోని ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారని రాజు సోదరుడు గణేష్ తెలిపారు. అక్కడి పోలీసులు వీరిని పట్టుకుని ఇంటికి పంపినట్లు సోదరుడు స్పష్టం చేశారు.

అనంతరం ఇంటికి వచ్చిన తర్వాత అమ్మాయిని దాచి పెట్టి, ఆమె కుటుంబ సభ్యులు తన తమ్ముణ్ణి కొట్టినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ప్రేమించిన యువతితో పెళ్లి చేస్తేనే కిందికి వస్తానని లేదంటే దూకేస్తానని రాజు చెబుతున్నట్లు గణేష్ వాపోయారు. రాజు కిందకు దిగిరావాలని కుటుంబ సభ్యులు బతిమిలాడుతున్నారు.

Last Updated : Apr 1, 2019, 11:50 AM IST

ABOUT THE AUTHOR

...view details