మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని గ్రేటర్ హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి.. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడ గుట్టపై వెలసిన భ్రమరాంబికా మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేయర్ విజయలక్ష్మితో పాటు ఇతర ప్రముఖులను ఆలయ కమిటీ ఛైర్మన్ తులసిరెడ్డి ఘనంగా సత్కరించి.. తీర్థప్రసాదాలు అందజేశారు.
భ్రమరాంబికా మల్లికార్జున స్వామి సేవలో హైదరాబాద్ మేయర్ - సంగారెడ్డి జిల్లా వార్తలు
మహా శివరాత్రి సందర్భంగా హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి బీరంగూడ గుట్టపై వెలసిన భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఛైర్మన్ తులసిరెడ్డి ఆమెను ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.

భ్రమరాంబికా మల్లికార్జున స్వామి సేవలో హైదరాబాద్ మేయర్
ఐదు రోజుల పాటు జరిగే శివరాత్రి ఉత్సవాలు బుధవారం నుంచే ప్రారంభమయ్యాయి. తొలిరోజు పుణ్యక్షేత్రంలో ఆలయ ప్రదక్షిణ, గోపూజ, కలశ పూజ గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవచనం నిర్వహించారు. ఇవాళ తెల్లవారుజామున మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం అనంతరం భక్తులకు స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించారు.
ఇదీ చూడండి: లైవ్ వీడియో: కోతుల నుంచి తప్పించుకోబోయి విద్యార్థిని మృతి