కరోనా పరిశోధనల్లో ఐఐటీ హైదరాబాద్ కీలక అడుగు వేసింది. అతి తక్కువ ధరలో, స్వల్పకాలంలో స్పష్టమైన ఫలితం వచ్చేలా.. కరోనా నిర్ధరణ కిట్‌ను రూపొందించింది. ఇప్పటికే అతి తక్కువ ధరలో వెంటిలేటర్లను అభివృద్ధి చేసిన ఈ సంస్థ.. అదే బాటలో కొవిడ్-19 టెస్ట్ కిట్‌ను రూపొందించింది. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌కు చెందిన ప్రొఫెసర్ శివగోవింద్ సింగ్ సారథ్యంలోని పరిశోధక బృందం సభ్యులు డాక్టర్ సూర్యస్నాత త్రిపాఠి, సుప్రజ అనే పరిశోధక విద్యార్థులు దీనిలో కీలక పాత్ర పోషించారు.
కరోనా పరిశోధనల్లో ఐఐటీ హైదరాబాద్ మరో ముందడుగు
కరోనా పరిశోధనల్లో ఐఐటీ హైదరాబాద్ కీలక అడుగు వేసింది. అతి తక్కువ ధరలో కరోనా నిర్ధరణ కిట్‌ను తయారు చేసింది. కృత్రిమ మేథను ఉపయోగించి.. 20 నిమిషాల్లోనే ఫలితం రాబట్టేలా టెస్ట్ కిట్‌కు రూపకల్పన చేసింది ఇంజినీరింగ్ ప్రొఫెసర్ శివగోవింద్ సింగ్ సారథ్యంలోని పరిశోధక బృందం.
కరోనా పరిశోధనల్లో ఐఐటీ హైదరాబాద్ మరో ముందడుగు
కేవలం 20 నిమిషాల్లోనే స్పష్టమైన ఫలితాన్ని రాబట్టేలా.. కృత్రిమ మేథను సైతం వినియోగిస్తున్నారు. ఈఎస్ఐసీ వైద్య కళాశాల, హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో ఈ టెస్ట్ కిట్ విజయవంతమైంది. ఈ కిట్లను పెద్ద ఎత్తున తయారికీ అనుమతించాలంటూ ఐసీఎంఆర్‌కు దరఖాస్తు చేశారు. ఒక్కో టెస్ట్ కిట్ తయారీకి రూ.600 ఖర్చవుతోందని.. భారీ సంఖ్యలో ఉత్పత్తి చేస్తే వ్యయం 350 రూపాయల లోపు తగ్గుతుందని ప్రొఫెసర్ శివగోవింద్‌సింగ్ తెలిపారు.
TAGGED:
హైదరాబాద్ ఐఐటీ తాజా వార్తలు