ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 51వ రోజూ కొనసాగుతోంది. సమ్మెలో భాగంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని డిపో ఆవరణలో గల ఫ్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి కార్మికులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కొత్త బస్టాండ్ వద్ద మానవహారం నిర్వహించారు. ఆర్టీసీని పరిరక్షించాలని.. ప్రైవేటీకరణ చేయవద్దని కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విధుల్లోకి చేరేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఎలాంటి షరతులు లేకుండా తమను విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఆర్టీసీ కార్మికుల మానవహారం - latest rtc news in sangareddy
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని డిపో ఆవరణలో కార్మికులు మానవహారం చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఆర్టీసీ కార్మికుల మానవహారం