తెలంగాణ

telangana

నారాయణఖేడ్​లో అకాల వర్షాలతో అపార నష్టం

By

Published : Apr 21, 2020, 2:39 PM IST

రెండు రోజులతో కురుస్తున్న వర్షాలతో సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​లోని పలు గ్రామాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. పంటలు నేల పాలు కావటం వల్ల రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

http://10.10.50.85//telangana/21-April-2020/tg-srd-36-21-vasrsham-bhibatsam-ts10055_21042020125313_2104f_1587453793_623.jpg
నారాయణఖేడ్​లో అకాల వర్షాలతో అపార నష్టం

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని మనురు, నాగల్ గిద్ద మండలాల్లో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. రెండు రోజులుగా ఈదురుగాలులతో కూడిన వర్షం కురవటం వల్ల మండలంలోని పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి.

అకల వర్షాలతో మొక్కజొన్న, జొన్న, మిరప తదితర పంటలకు నష్టం వాటిల్లింది. చేతికి రావాల్సిన పంటలు వర్షానికి నేల పాటు కావటం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంటల నష్ట వివరాలు సేకరించి పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.

నారాయణఖేడ్​లో అకాల వర్షాలతో అపార నష్టం

ఇవీ చూడండి:కరోనా వేళ కేంద్రం కోత.. రాష్ట్రాన్ని నడిపేదెట్టా?

ABOUT THE AUTHOR

...view details