తెలంగాణ

telangana

ETV Bharat / state

పటాన్ చెరు ఐడీఏలోని గోదాంలో భారీ అగ్ని ప్రమాదం... - HUGE FIRE ACCIDENT IN PATANCHERU IDA SANGAREDDY DISTRICT

సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరు పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

తుక్కు గోదాంలో భారీగా మంటలు
తుక్కు గోదాంలో భారీగా మంటలు

By

Published : Apr 9, 2020, 3:39 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ఐడీఏలోని తుక్కు గోదాంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. రేణుక ఎల్లమ్మ దేవాలయం సమీపంలోని తులసీదాస్ ట్రేడర్స్ తుక్కు గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు వచ్చి మంటలు దావానంలా అలుముకున్నాయి. గోదాంలో రబ్బరు ప్లాస్టిక్ వస్తువులు ఎక్కువగా ఉండటం వల్ల మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. పటాన్ చెరు, పాశమైలారం పారిశ్రామిక వాడ నుంచి రెండు అగ్నిమాపక శకటాలు మంటలను అదుపులోకి తెచ్చాయి. అయినప్పటికీ రబ్బర్, ప్లాస్టిక్ వస్తువులు అంటుకుని దట్టమైన పొగలు ఆ ప్రాంతాన్ని కమ్ముకున్నాయి.

తుక్కు గోదాంలో భారీగా మంటలు

ABOUT THE AUTHOR

...view details