Huge Amount of Money Seized in Telangana 2023 : ఎన్నికల నిబంధనల పేరిట ప్రత్యేక తనిఖీ బృందాలు(Police Checks in Telangana) సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తనిఖీల్లో నగదు, బంగారం ఏదైనా బయటపడితే ఇక అంతే సంగతి సరైన పత్రాలు చూపించాలని పోలీసులు హుకుం జారీ చేస్తున్నారు. సోదాల్లో పట్టుబడిన సొమ్ము పిల్లల ఫీజు కట్టేందుకు లేదా పెళ్లి కోసం చీరలు, బంగారం కొనడానికి తీసుకెళ్తున్నామని చెప్పినా కొన్నిచోట్ల పోలీసులు పట్టించుకోవడం లేదు. హవాలా మార్గంలో డబ్బులు తరలించేవాళ్లను, అక్రమ బంగారం(Huge Money and Gold Seized in Telangana) వ్యాపారం చేసే వాళ్లను, సామాన్యులను ఒకే తరహాలో చూస్తున్నారు. సరైన పత్రాలు చూపించకపోతే ఎన్నికల కోడ్ ప్రకారం స్వాధీనం చేసుకోవాల్సిందే అంటూ సమాధానం ఇస్తున్నారు.
Police Searches in Telangana Election Code : ఎన్నికల కోడ్ అమల్లోకి రావటంతో అడుగడుగునా పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. తనిఖీల ద్వారా ఇప్పటి వరకూ పట్టుకున్న సొమ్ము రూ.168 కోట్లకు పైమాటే అని అధికారులు పేర్కొన్నారు. వారిలో హవాలా, బంగారు వర్తకులు, సిరాస్తి వ్యాపారులే అధికశాతం ఉన్నారు. మూడు రోజుల క్రితం హైదరాబాద్ శివారులో ఓ వ్యక్తి వద్ద కోటి నగదు పట్టుబడింది. వనస్థలిపురంలో కారులో తరలిస్తున్న రూ.29.40లక్షలు స్వాధీనం చేసుకున్న ఎస్ఓటీ పోలీసులు.. వనస్థలిపురం పోలీసులకు అప్పగించారు.
Hyderabad Police Checks Vehicles Seized Cash :కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రమ్య గ్రౌండ్స్‌లో రూ.26 లక్షలను బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుషాయిగూడ ఠాణా పరిధిలోనూ వాహన తనిఖీల్లో రూ.30 లక్షలు చిక్కాయి. అబిడ్స్‌లో 5 ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో రూ.21.94 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. నెక్లెస్ రోడ్‌లో ఓ ద్విచక్ర వాహనదారుడి వద్ద నుంచి రెండు లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మియాపూర్‌లో 27.5 కిలోల బంగారం, 15.6 కిలోల వెండి పట్టుబడింది. దాన్ని ఐటీ అధికారులకు అప్పగిస్తామని మియాపూర్ ఇన్స్‌స్పెక్టర్ వెల్లడించారు. మరో వైపు తనిఖీల్లో లిక్కర్, గంజాయి భారీగా పట్టుబడుతోంది.