తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈనాడులో దివ్యాంగుడి కథనం... సుమోటోగా తీసుకున్న హెచ్చార్సీ - Eenadu news paper article

సంగారెడ్డి జిల్లా మునిమాణిక్యం గ్రామానికి చెందిన ఓ దివ్యాంగుడి దీనగాథ ఈనాడులో ప్రచురితం కాగా... స్పందించిన హెచ్చార్సీ సుమోటోగా కేసును స్వీకరించింది. ఈ మేరకు సంగారెడ్డి జిల్లా కలెక్టర్​కు హెచ్చార్సీ ఆదేశాలు జారీ చేసింది.

ఈనాడులో దివ్యాంగుడి కథనం... సుమోటోగా తీసుకున్న హెచ్చార్సీ
ఈనాడులో దివ్యాంగుడి కథనం... సుమోటోగా తీసుకున్న హెచ్చార్సీ

By

Published : Feb 6, 2021, 5:43 PM IST

Updated : Feb 6, 2021, 5:57 PM IST

ఈనాడు కథనం...

ఈనాడు దినపత్రికలో ప్రచురితమైన "బతుకు బండికి ఊతమివ్వరూ" అనే కథనం ఆధారంగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసును విచారణకు స్వీకరించింది. సంగారెడ్డి జిల్లా మునిమాణిక్యం గ్రామానికి చెందిన మొగులయ్య దివ్యాంగుడు. మూడేళ్లుగా బ్యాటరీ సైకిల్ మంజూరు చేయాలంటూ... కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా... అధికారులు స్పందించలేదు.

దివ్యాంగుడి వేదనను ఈనాడు పత్రికలో ప్రచురించగా... హెచ్చార్సీ కేసు విచారణకు ఆదేశించింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేసి ఈనెల 24లోగా సమర్పించాలంటూ సంగారెడ్డి జిల్లా కలెక్టర్​కు హెచ్చార్సీ ఆదేశాలు జారీచేసింది.

ఇదీ చూడండి:ఎయిరోస్పేస్​ హబ్​గా తెలంగాణ: మంత్రి కేటీఆర్

Last Updated : Feb 6, 2021, 5:57 PM IST

ABOUT THE AUTHOR

...view details