గురువారం సాయంత్రం సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలోని రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులకు గాయాలైనట్లు.. వచ్చిన దిన పత్రికల కథనం ఆధారంగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు స్వీకరించింది. మెంబర్ సెక్రటరీ తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, లేబర్ కమిషనర్‌కు నోటీసులు జారీ చేశారు.
బొల్లారం ఘటనపై హెచ్ఆర్సీ స్పందన.. సుమోటోగా కేసు స్వీకరణ - ఐడీఏ బొల్లారం అగ్ని ప్రమాదం తాజా వార్తలు
ఐడీఏ బొల్లారం అగ్ని ప్రమాదంపై హెచ్ఆర్సీ స్పందించింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలు కాగా.. మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు తీసుకుంది. ఘటనకు కారణాలు, అధికారుల చర్యలు, కార్మికులకు అందించిన చికిత్స, సహాయం గురించి నివేదించాల్సిందిగా ఆదేశించింది. అందుకు జూన్ 24 వరకు గడువు విధించింది.
బొల్లారం ఘటనపై హెచ్ఆర్సీ స్పందన.. సుమోటోగా కేసు స్వీకరణ
ఈ ఘటన జరగడానికి కారణాలేంటి, అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు, గాయపడిన కార్మికులకు అందించిన చికిత్స.. వారి స్థితి, వారికందిన సహాయం గురించి జూన్ 24లోగా క్లుప్తంగా నివేదించాల్సిందిగా హెచ్ఆర్సీ ఆదేశించింది.
ఇదీ చూడండి :మృతదేహాలను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి