కరోనాకు చికిత్స అందించింది వైద్యారోగ్య శాఖ అయితే.. నివారించింది మాత్రం పోలీస్ శాఖ అని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన పట్టణ పోలీస్ స్టేషన్‌ను శాసన మండలి ప్రోటెం స్పీకర్ భూపాల్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు.
ఆ క్రెడిట్ పోలీసులదే: హోం మంత్రి మహమూద్ అలీ - తెలంగాణ హోం శాఖ మంత్రి
కరోనా మహమ్మారిని కట్టడి చేసే క్రమంలో అనేక మంది పోలీసులు తమ ప్రాణాలను త్యాగం చేశారని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. సంగారెడ్డి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు. త్వరలోనే అభివృద్ధి చెందిన దేశాల తరహాలో పోలీసింగ్ వ్యవస్థను రాష్ట్రంలో అమలు పరుస్తామని పేర్కొన్నారు.
![ఆ క్రెడిట్ పోలీసులదే: హోం మంత్రి మహమూద్ అలీ Home Minister Mahmood Ali inaugurated the town police station in Sangareddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12105964-71-12105964-1623483414091.jpg)
సంగారెడ్డిలో పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించిన హోం మంత్రి ముహమ్మద్ అలీ
కొవిడ్ కట్టడి చర్యల్లో భాగంగా అనేక మంది పోలీసులు తమ ప్రాణాలను త్యాగం చేశారని హోం మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీస్ శాఖకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. నిధులు, నియామాకాలు మరింత పెంచామని స్పష్టం చేశారు. రాష్ట్ర పోలీసుకు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉందన్న మంత్రి.. పోలీస్ శాఖకు అధిక నిధులు కేటాయించినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే అభివృద్ధి చెందిన దేశాల తరహాలో పోలీసింగ్ వ్యవస్థను రాష్ట్రంలో అమలు పరుస్తామని చెప్పారు.