తెలంగాణ

telangana

ETV Bharat / state

Home minister: రాష్ట్ర ప్రజలకు పండుగరోజు.. - తెలంగాణ తాజా వార్తలు

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలక్టరేట్ ఆవరణలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రామానికి హాజరైన హోం మంత్రి మహమూద్ అలీ జాతీయజెండా ఎగురవేశారు. ముందుగా అమరవీరుల స్తూపానికి, తెలుగు తల్లి విగ్రహానికి పూల మాలలు చేశారు.

Telangana news
మహమూద్​ అలీ

By

Published : Jun 2, 2021, 12:21 PM IST

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రాష్ట్ర ప్రజలకు పండగ లాంటిదని హోంమంత్రి మహమూద్​ అలీ (Home minister: ) అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రాంతం అన్ని రంగాల్లోను అభివృద్ధి సాధిస్తోందన్నారు. ప్రజల నమ్మకాన్ని తెరాస ప్రభుత్వం కాపాడుతుందని తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు.

రాష్ట్రంలో అత్యున్నతమైన పోలీస్​ వ్యవస్థ ఉందని హోంమంత్రి అన్నారు. కొవిడ్​ కట్టడికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోందని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చి వైద్యం చేయించుకునేంతగా అభివృద్ధి చేశామని వెల్లడించారు. రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఇదీ చూడండి:Harish rao: అమరవీరులకు మంత్రి హరీశ్‌ రావు నివాళులు

ABOUT THE AUTHOR

...view details