లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నందున అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. జహీరాబాద్‌లో తెరాస ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్‌కు మద్దతుగా హోం మంత్రి మహమూద్ అలీ రోడ్‌షోలో పాల్గొన్నారు. గత ఐదేళ్లుగా ఎంపీగా సేవలందించిన పాటిల్‌ను మరోసారి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రోడ్‌షో అనంతరం సభ నిర్వహించి ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. ఆయనతో పాటు స్థానిక ఎమ్మెల్యే మాణిక్యరావు, ఎమ్మెల్సీ మహమూద్ ఫరీదుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
బీబీ పాటిల్ తరఫున హోం మంత్రి ప్రచారం - jaheerabad
జహీరాబాద్ లోక్‌సభ తెరాస అభ్యర్థి బీబీ పాటిల్ తరఫున హోంమంత్రి మహమూద్ అలీ ప్రచారంలో పాల్గొన్నారు. కారు గుర్తుకు ఓటేసి పాటిల్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
సంగారెడ్డి ఎంపీ అభ్యర్థి తరఫున హోం మంత్రి ప్రచారం