సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ అనాథాశ్రమంలో లైంగిక దాడికి గురై బాలిక మరణించిన ఘటనపై తరుణి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు రాసిన లేఖను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. మారుతీ అనాథాశ్రమంలో 14 ఏళ్ల బాలికపై లైంగిక దాడి నేపథ్యంలో.. రాష్ట్రంలో చిన్నారుల రక్షణపైనే ఆందోళన కలిగించేలా ఉందని ఆమె లేఖలో పేర్కొన్నారు.
అమీన్‌పూర్ లైంగికదాడి ఘటనపై హైకోర్టు సుమోటో విచారణ - మమత రఘువీర్ హైకోర్టుకు లేఖ
అమీన్‌పూర్ అనాథాశ్రమంలో బాలికపై లైంగిక దాడి ఘటనపై తరుణి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు మమత రఘువీర్ హైకోర్టుకు లేఖ రాశారు. ఆ లేఖను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఆ ఘటనపై వివరణ ఇవ్వాలని సీఎస్, హోం, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శులతోపాటు డీజీపీ, సంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది.
జిల్లా శిశు సంక్షేమ కమిటీలు, శిశు రక్షణ విభాగాలు నెలకొల్పాలని.. జువైనల్ బోర్డు సభ్యులను నియమించాలని ఆమె కోరారు. వాటి పని తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించే బాధ్యత జిల్లా కోర్టులకు అప్పగించాలని ఆమె తెలిపారు. చిన్నారులపై నేరాల శిక్షలను పర్యవేక్షించేందుకు హైకోర్టులో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని లేఖలో మమత రఘువీర్ పేర్కొన్నారు. లేఖను పిటిషన్‌గా స్వీకరించిన హైకోర్టు.. వివరణ ఇవ్వాలని సీఎస్, హోం, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శులతోపాటు డీజీపీ, సంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశిస్తూ విచారణ నవంబరు ఐదుకి వాయిదా వేసింది.
ఇదీ చూడండి :మహిళ అదృశ్యం .. అనుమానాస్పద స్థితిలో మృతి