తెలంగాణ

telangana

ETV Bharat / state

జిల్లా కేంద్రంలో పోక్సో ప్రత్యేక న్యాయస్థానం ప్రారంభం - సంగారెడ్డి జిల్లా తాజా వార్తలు

అందరి సహకారంతో రానున్న రోజుల్లో పొక్సో చట్టం కింద కేసులు ఉండకుండా చూడాలని ఆశిస్తున్నట్లు... హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్​ అమర్​నాథ్ గౌడ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పోక్సో ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆయన ప్రారంభించారు.

High Court Judge Justice Amarnath Gowda inaugurated the Posco Special Court in Sangareddy district
జిల్లా కేంద్రంలో పోక్సో ప్రత్యేక న్యాయస్థానం ప్రారంభం

By

Published : Feb 13, 2021, 3:35 PM IST

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పోక్సో ప్రత్యేక న్యాయస్థానాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్​ అమర్​నాథ్ గౌడ్ ప్రారంభించారు. గతంలో ఈ చట్టం కింద నమోదయ్యే కేసులు ఎక్కువగా ఉండేవని... ప్రస్తుతం అవి చాలా వరకు తగ్గుముఖం పట్టడం సంతోషకరమని ఆయన అన్నారు.

అందరి సహకారంతో రానున్న రోజుల్లో పొక్సో కేసులు ఉండకుండా చూడాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. అధికారులంతా ఎలాంటి కల్మషం లేకుండా పని చేయాలని అన్నారు. ప్రస్తుతం ఉన్న కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి, బార్ అసోసియేషన్ మెంబర్ విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: పదమూడేళ్ల బాలికపై అత్యాచారం

ABOUT THE AUTHOR

...view details