సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో మధ్యాహ్నం సుమారు ఒంటి గంట సమయంలో పెద్దఎత్తున వర్షం పడింది. ఉరుములు, మెరుపులతో భారీ ఎత్తున్న కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
పటాన్చెరులో భారీ వర్షం... నీట మునిగిన రహదారులు - పటాన్చెరులో ఉరుములు, మెరుపులతో వర్షం
పటాన్చెరులో ఉరుములు, మెరుపులు, తీవ్రమైన గాలులతో జోరు వర్షం కురిసింది. దాదాపు గంటకుపైగా పడ్డ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి.

పటాన్చెరులో భారీ వర్షం... నీట మునిగిన రహదారులు
ముఖ్యంగా జేపీ కాలనీలోని వాణి హైస్కూల్ సమీపంలో మురికి నీరంతా రోడ్లపైకి చేరడం వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వేసవి కాలం ముగుస్తున్న తరుణంలో ఈ స్థాయిలో వర్షం పడటం ఇదే ప్రథమని స్థానికులు అంటున్నారు.
ఇదీ చుడండి: మిడతల దండు కదలికలపై ఆరా.. హెలీకాప్టర్లో ప్రత్యేక బృందం