Sangareddy Rains : ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షానికి సంగారెడ్డి నియోజకవర్గంలోని మల్కాపూర్ పెద్ద చెరువు ఉప్పొంగి పారుతోంది. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్-తొగరపల్లి పెద్ద చెరువు గత వర్షాలకు నిండుకుండలా మారింది. నిన్నటి నుంచి మండలంలో 68.5 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో తొగరపల్లి, మల్కాపూర్ గ్రామాల అలుగులు పారుతున్నాయి. ఈ అలుగు అందాలు చూడటానికి గ్రామస్థులు పెద్దఎత్తువ తరలివస్తున్నారు.
పెద్ద చెరువు అలుగు అందం.. జాగ్రత్తగా ఉండాలంటూ అప్రమత్తం - SANGAREDDY RAINS NEWS
Sangareddy Rains : సంగారెడ్డి జిల్లాలోని మల్కాపూర్-తొగరపల్లి పెద్ద చెరువు ఉప్పొంగి పారుతోంది. అలుగు పారుతున్న చెరువు అందాలను చూడటానికి ప్రజలు ఎగబడుతున్నారు. కానీ.. ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో అధికారులు కంచె ఏర్పాటు చేశారు. ప్రజలెవరూ కంచె దాటొద్దని హెచ్చరించారు.
ఉప్పొంగి పారుతోన్న పెద్ద చెరువు.. అధికారులు అప్రమత్తం
ఎలాంటి ప్రమాదాలు జరగకూడదని.. అప్రమత్తమైన అధికారులు పెద్ద చెరువు వద్ద కర్రలతో కంచె ఏర్పాటు చేశారు. ఉద్ధృతి ఎక్కువగా ఉన్నందున ప్రజలెవరూ కంచె దాటొద్దని హెచ్చరించారు. చాలా కాలం తర్వాత పెద్ద చెరువు అలుగు పోస్తుండటంతో చూసేందుకు స్థానికులు, చుట్టు పక్కల గ్రామస్థులు పోటెత్తారు.
- ఇవీ చూడండి..హైదరాబాద్లో అర్ధరాత్రి భారీ వర్షం.. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం!
- Heavy Rain in Hyderabad : అర్ధరాత్రి వచ్చింది.. ఆగం చేసింది..!
- Twin Reservoirs : జంట జలాశయాలకు ఉద్ధృతంగా వరద
- సెల్లార్లోకి వరద ప్రవాహం.. నీటమునిగిన వాహనాలు
- రహదారిపై పారుతోన్న అలుగు.. రాకపోకలకు అంతరాయం