తెలంగాణ

telangana

ETV Bharat / state

నిమ్జ్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా! - హైకోర్టు ఆదేశం

జహీరాబాద్‌ నిమ్జ్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రేపు జరగాల్సిన బహిరంగ విచారణ వాయిదా వేయాలని చెప్పింది.

HC Order to postpone referendum on Nimz formation in zaheerabad
నిమ్జ్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా వేయాలని ఆదేశం

By

Published : Jul 9, 2020, 2:56 PM IST

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ నిమ్జ్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశించింది. కరోనా దృష్ట్యా ప్రజాభిప్రాయ సేకరణ ఆపాలని... ఐదుగురు రైతులు వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది.

రేపు జరగాల్సిన బహిరంగ విచారణ వాయిదా వేయాలని చెప్పింది. ఈ ప్రక్రియ కోసం ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయడంతోపాటు... నిమ్జ్‌ ఏర్పాటుకు జహీరాబాద్‌ ప్రాంతంలో భూసేకరణ చేస్తోంది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని, సారవంతమైన భూములు ఇవ్వబోమని రైతులు వ్యతిరేకించడంతో... 2015 నుంచి భూసేకరణ నెమ్మదించింది. ఇటీవల కాలంలో అధికారులు ఈ ప్రక్రియను వేగవంతం చేశారు. రేపు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని ఏర్పాట్లు చేశారు. రైతుల ఇందుకు విముఖత వ్యక్తం చేస్తూ పిటిషన్‌ వేయడంతో... హైకోర్టు వాయిదా వేయాలని ఆదేశించింది.

ABOUT THE AUTHOR

...view details