తెలంగాణ

telangana

ETV Bharat / state

పట్టణాన్ని నందనవనంగా మారుద్దాం: అదనపు పాలనాధికారి - సంగారెడ్డిలో హరితహారం కార్యక్రమం

ప్రతి కాలనీలో మొక్కలునాటి పట్టణాన్ని నందనవనంగా మారుద్దామని అదనపు పాలనాధికారి, పురపాలక ఇన్‌ఛార్జి కమిషనర్‌ రాజర్షిషా అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా పోతిరెడ్డిపల్లిలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.

harithaharam program in pothireddypalli
పట్టణాన్ని నందనవనంగా మారుద్దాం: అదనపు పాలనాధికారి

By

Published : Aug 5, 2020, 11:59 AM IST

హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను స్థానికులు సంరక్షించాలని అదనపు పాలనాధికారి రాజర్షిషా సూచించారు. ఇందుకు ప్రత్యేకంగా బాధ్యత తీసుకోవాలన్నారు. హరితహారంలో భాగంగా సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో పురపాలక చైర్మన్ విజయలక్ష్మి, వైస్ చైర్మన్ లత, కౌన్సిలర్‌ నాయికోటి రామప్ప పాల్గొన్నారు.

అనుమతి లేని కట్టడాలపై కఠిన చర్యలు

పట్టణంలో అనుమతి లేని వెంచర్లు, కట్టడాలపై కఠిన చర్యలు తీసుకుంటామని రాజర్షిషా పేర్కొన్నారు. మంగళవారం కార్యాలయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. అనుమతి లేకుండా నిర్మిస్తున్న కట్టడాలపై సర్వే నిర్వహించాలని పట్టణ ప్రణాళికా విభాగం అధికారులకు సూచించారు. యజమానులకు నోటీసులు ఇవ్వాలని, స్పందించకుంటే పోలీసుల సహాయంతో కూల్చివేయాలన్నారు. సమావేశంలో పట్టణ ప్రణాళిక విభాగం అధికారి లక్ష్మినారాయణ, టీపీఎస్‌ వినీత్‌ పాల్గొన్నారు.

ఇదీ చూడండి:కల్లు ఉద్దెర ఇవ్వనందుకు కత్తితో ముగ్గురిపై దాడి

ABOUT THE AUTHOR

...view details