తెలంగాణ

telangana

ETV Bharat / state

'గ్రామీణ ప్రాంతాల్లో ఆర్​ఎంపీలు, పీఎంపీల పాత్ర కీలకం' - ఆర్​ఎంపీ పీఎఁపీలపై తాజా వార్త

ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటులో ఆర్​ఎంపీలు, పీపీఎంలు కీలక పాత్ర పోషించారని వారి సమస్యలను తర్వలో పరిష్కరించేలా చూస్తామని మంత్రి హరీశ్​ రావ్​ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులో గ్రామీణ వైద్యుల సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

harish-rao-talk-on-ramp-pmp-workers-in-sangareddy
'గ్రామీణ ప్రాంతాల్లో ఆర్​ఎంపీలు, పీఎంపీల పాత్ర కీలకం'

By

Published : Jan 7, 2020, 2:48 PM IST

పల్లె ప్రగతి ప్రవేశపెట్టి గ్రామాలను కేసీఆర్ శుభ్రంగా ఉండేలా చేశారని ఆర్థిక మంత్రి హరీశ్​రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్​లో జిల్లా ఆర్ఎంపీ, పీఎంపీ గ్రామీణ వైద్యుల సంఘం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

రాష్ట్ర ఏర్పాటులో ఆర్ఎంపీ, పీఎంపీలు కీలకపాత్ర పోషించారని ఆయన చెప్పారు. పల్లె అభివృద్ధికి పల్లె ప్రగతితో పాటు పట్టణ ప్రజల కోసం మున్సిపల్ చట్టాల్లో మార్పులు తీసుకువచ్చామని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి ముడిపడి ఉందని ఆయన పేర్కొన్నారు.

గతంలో కరెంటు ఉంటే వార్తని.. ప్రస్తుతం కరెంట్ పోతే వార్త అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు రాష్ట్రంలో 500కు పైగా రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు.ఆర్ఎంపీ, పీఎంపీ సమస్యలను మంత్రి ఈటెల రాజేందర్​తో మాట్లాడి పరిష్కరించేలా చేస్తామన్నారు.

'గ్రామీణ ప్రాంతాల్లో ఆర్​ఎంపీలు, పీఎంపీల పాత్ర కీలకం'

ఇదీ చదవండిః 2020లో టీ హబ్‌ రెండో దశ ప్రారంభం: కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details