తెలంగాణ

telangana

ETV Bharat / state

'వైకుంఠధామాలు, రెండుపడకల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి'

సంగారెడ్డి జిల్లాలో అభివృద్ధి పనులపై మంత్రి హరీశ్‌ సమీక్ష నిర్వహించారు. వైకుంఠధామాలు, రెండుపడకల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే యాసంగి కల్లా రైతువేదికల నిర్మాణం పూర్తికావాలని మంత్రి తెలిపారు.

harish rao said double bedroom houses, Vaikunta Dhamalu should be completed
'వైకుంఠధామాలు, రెండుపడకల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి'

By

Published : Jun 19, 2020, 10:23 PM IST

'వైకుంఠధామాలు, రెండుపడకల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి'

గ్రామీణ మౌళిక వసతుల కల్పనలో తెలంగాణ దేశానికే ఆదర్శం కాబోతుందని ఆర్థిక మంత్రి హరీశ్ రావు పేర్కోన్నారు. ఇప్పటికే ప్రతి గ్రామానికి ట్రాక్టర్, నీటి ట్యాంకర్, నర్సరీ ఏర్పాటు చేశామని.. త్వరలో డంప్ యార్డ్, వైకుంఠధామాల పనులు పూర్తి అవుతాయన్నారు. సంగారెడ్డి జిల్లాలో జరగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై పురోగతిపై వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్​లో ఆయన సమీక్ష నిర్వహించారు.

పనులు వేగవంతం చేయాలి

సంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న 4 జాతీయ రహదారుల పనులపై మంత్రి హరీశ్ అధికారులతో సమావేశం జరిపారు. నాందేడ్- అకోలా పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. నారాయణఖేడ్- బీదర్ మధ్య జాతీయ రహదారి భూసేకరణ కోసం నిధులు మంజూరయ్యాయని.. భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని రెవిన్యూ అధికారులను ఆదేశించారు. 65జాతీయ రహదారిపై బీహెచ్ఈఎల్ వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం 75 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని.. టెండర్ ప్రక్రియ పూర్తి చేసి.. పనులు ప్రారంభించాలన్నారు. ఇస్నాపూర్ వద్ద రోడ్డును ఆరు వరుసలుగా విస్తరించే పనులు మొదలుపెట్టాలన్నారు. నిర్మాణ సంస్థతో రోడ్డుకు ఇరువైపుల మొక్కలు నాటించాలన్నారు.

రాష్ట్రంలో ప్రథమ స్థానం

జిల్లాలో 116 రైతు వేదికలు నిర్మిస్తున్నామని.. ఇప్పటికే భూ కేటాయింపులు జరిగాయని.. ఒకే రోజు అన్నింటికీ భూమి పూజ నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు. 3 నెల్లలో పనులు పూర్తి చేసి.. జిల్లా మొత్తం ఒకే రోజు ప్రారంభిస్తామన్నారు. 1447 రెండు పడక గదుల ఇళ్లు నిర్మాణ చివరి దశలో ఉన్నాయని.. రెండు నెలల్లో పనులు పూర్తి చేసి.. లబ్దిదారులకు అందజేస్తామన్నారు. డంప్ యార్డులు, వైకుంఠ ధామాల నిర్మాణంలో సంగారెడ్డి జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉందన్నారు. ఇప్పటికే సగం గ్రామల్లో పనులు పూర్తయ్యాయని.. 45 రోజుల్లో అన్నీ గ్రామాల్లో పూర్తి చేసి.. జాతీయ స్థాయిలో గుర్తింపు సాధిస్తామన్నారు. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి ముగ్గురు అధికారులకు ప్రత్యేకంగా అవార్డు అందజేస్తామని ప్రకటించారు.

నివారణ చర్యలపై

సంగారెడ్డి జిల్లాలో కరోనా ప్రభావం, నివారణ చర్యలపైన మంత్రి సమీక్ష నిర్వహించారు. కరోనాతోపాటు ఇతర వ్యాధుల నివారణ కోసం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. సంగారెడ్డి జిల్లాలో 71 కరోనా కేసులు నమోదయ్యాయని.. ప్రస్తుతం 32 మంది చికిత్స పోందుతున్నారని ఆయన వివరించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని.. స్వీయ నియంత్రణ పాటించాలని ప్రజలకు సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని హితవు పలికారు. జిల్లాలో వేగంగా డంప్ యార్డులు, వైకుంఠధామాల నిర్మాణం కోసం పలువురు అధికారులను తాత్కాలిక స్థాన చలనం చేశారు.

ఇదీ చూడండి :కర్నల్‌ సంతోష్‌బాబు కుటుంబానికి రూ.5 కోట్లు ప్రకటించిన సీఎం

ABOUT THE AUTHOR

...view details