సంగారెడ్డి జిల్లాలో కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై ఆర్థిక మంత్రి హరీశ్‌రావు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. సంగారెడ్డి జిల్లా సరిహద్దులో ఉన్న కర్ణాటక, మహారాష్ట్రల నుంచి కరోనా అనుమానితులు రాకుండా చర్యలు చేపట్టాలన్నారు.
పురపాలిక సిబ్బందికి పది రోజులకు సరిపోయే మాస్కులు, చేతి గ్లౌవ్స్, శానిటైజర్లు అందించాలన్నారు. జిల్లాలో శానిటైజర్లు, మాస్కుల కొరత లేకుండా జాగ్రత్త పడాలని సూచించారు.
వ్యవసాయ అవసరాల కోసం పట్టణాల్లోని దుకాణాలకు వచ్చే రైతులకు ఇబ్బందులు కలగకుండా పాసులు ఇవ్వాలని ఆదేశించారు. అంత్యక్రియల నిర్వహణ కోసం పోలీసుల అనుమతి తీసుకోవాలని.. వారి సూచనలకు అనుగుణంగా నిర్వహించాలని ప్రజలకు సూచించారు. అనంతరం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఐసోలేషన్ కేంద్రం ఏర్పాట్లు పరిశీలించారు. రేపటిలోగా 40 పడకలు అందుబాటులోకి తీసుకురావాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు.
జిల్లాలోకి కరోనా అనుమానితులు రాకుండా చూడండి: హరీశ్‌రావు ఇవీచూడండి:కరోనాపై యుద్ధం... రంగంలోకి మంత్రి కేటీఆర్