ఏడాదికి కోటి ఉద్యోగాలిస్తానని అధికారంలోకి వచ్చిన భాజపా... ఉన్నవాటిని సైతం ఊడిపోయేలా చేస్తోందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు దుయ్యబట్టారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు, భారతీనగర్ అభ్యర్థులు కుమార్ యాదవ్, సింధుకు మద్దతుగా మంత్రి రోడ్ షో నిర్వహించారు. అనంతరం జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్ యువతకు అన్యాయం చేసిన భాజపాకు ఎందుకు ఓటేయాలని మంత్రి ప్రశ్నించారు.
'నల్లధనమంతా భాజపా నాయకుల జేబుల్లోకే పోయింది' - జీహెచ్ఎంసీ ఎన్నికలు 2020
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు, భారతీనగర్‌లలో మంత్రి హరీశ్‌రావు రోడ్ షో నిర్వహించారు. అనంతరం జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్ యువతకు అన్యాయం చేసిన భాజపాకు ఎందుకు ఓటేయాలని మంత్రి ప్రశ్నించారు.
భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని తెలిపారు. విదేశాల నుంచి నల్లధనం తీసుకొస్తా అన్న భాజపా... ఇప్పటివరకు ఒక్క రూపాయి తీసుకురాలేదన్నారు. పెద్ద నోట్ల రద్దుతో నల్లదనం మొత్తం తెల్లగా మారి భాజపా నాయకుల బ్యాంకుల్లోకి, జేబుల్లోకే పోయిందన్నారు. 400 ఎకరాల్లో ఐటీ పార్కు, సుల్తాన్‌పూర్‌లోని 200 ఎకరాల్లో మెడికల్ డివైస్ పార్క్... ఏ ముఖ్యమంత్రికి రాని ఆలోచన సీఎం కేసీఆర్‌కు వచ్చిందన్నారు. శివానగర్‌లో కూడా ఎల్ఈడీ పార్క్ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు.