సంగారెడ్డి జిల్లా కోహిర్‌లోని ఓంకారేశ్వర ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్ రావు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పీఠాధిపతి దక్షిణామూర్తి మంత్రికి ఆశీస్సులు అందజేశారు. అనంతరం రథోత్సవ ఊరేగింపులో ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫరీదుద్ధీన్ హాజరయ్యారు. అంతకుముందు క్రికెట్ టోర్నమెంటు ప్రారంభించిన హరీశ్ రావు... క్రీడాకారులను ఉత్సాహపరిచారు.
మంత్రి హరీశ్ బ్యాట్ పట్టారు.. ఆపై... - harish rao participate mahashivarathri celebrations
కోహిర్‌లోని ఓంకారేశ్వర ఆలయంలో నిర్వహించిన మహాశివరాత్రి వేడుకల్లో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. అంతకుముందు పట్టణంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంటు ప్రారంభించి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.
బ్యాట్‌తో చెలరేగిన హరీశ్ రావు