తెలంగాణ

telangana

ETV Bharat / state

'పుర'పోరులో గెలుపు గుర్రాలకే టిక్కెట్లు: మంత్రి హరీశ్ - అలసత్వం పనికిరాదు: హరీశ్​ రావు

మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారయ్యాయని.. ఎన్నికల వాతావరణం వేడెక్కిందని.. ఇక అలసత్వం పనికిరాదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా బీరంగూడలోని ఓ ఫంక్షన్ హాల్​లో జిల్లా నేతలతో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు.

harish-rao-meet-with-sangareddy-district-leaders
పుర'పోరు'లో గెలుపు గుర్రాలకే టిక్కెట్లు: మంత్రి హరీశ్

By

Published : Jan 5, 2020, 5:10 PM IST

Updated : Jan 5, 2020, 7:08 PM IST

మున్సిపల్​ ఎన్నికల సందండి మొదలైంది. సంగారెడ్డి జిల్లా బీరంగూడలోని ఓ ఫంక్షన్​ హాల్లో జిల్లా నేతలతో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు సమావేశమయ్యారు. పురపాలక ఎన్నికలపై చర్చించారు. మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారయ్యాయని, ఎన్నికల వాతావరణం వేడెక్కిందని, ఇక అలసత్వం పనికిరాదన్నారు. ప్రభుత్వ పథకాల లబ్దిదారులు ప్రతి వార్డులో ఉన్నారని.. వారందరినీ కలవాలని సూచించారు.

టికెట్ రాలేదని నిరాశ చెందొద్దు

ప్రజలు కోరుకున్న, గెలిచే అభ్యర్థులను పార్టీ ఎంపిక చేస్తుందని తెలిపారు. ఎంపిక చేసిన అభ్యర్థులను గెలిపించేందుకు కష్టపడాలని చెప్పారు. ఆశావహులు టికెట్ రాలేదని నిరాశ చెందొద్దని అన్నారు. పనిచేసే ప్రతి ఒక్కరినీ పార్టీ గౌరవిస్తుందని తెలిపారు. నామినేటెడ్ పోస్టులతో ఇప్పుడు అవకాశం రాని వారిని గౌరవించుకుందాం అని చెప్పారు.

అలసత్వం పనికిరాదు: హరీశ్​ రావు

ఇవీ చూడండి: పురపోరుకు విడుదలైన ఓటర్ల తుది జాబితా ఇదే..

Last Updated : Jan 5, 2020, 7:08 PM IST

ABOUT THE AUTHOR

...view details