తెలంగాణ

telangana

ETV Bharat / state

'కేసీఆర్​ తలుచుకుంటే రేవంత్​ని ఎప్పుడో ఓటుకు నోటు కేసులో జైలులో వేసేవారు' - రేవంత్​రెడ్డిపై హరీశ్​రావు కామెంట్స్

Harish Rao Meet Patnam Manikyam in Sangareddy : విజయదశమికి పాలపిట్ట ఎంత శుభసూచకమో.. రాష్ట్రానికి కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉండటం అంతే శుభసూచకమని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా ఫసల్‌వాది గ్రామంలో బీఆర్​ఎస్​ ముఖ్య నేత పట్నం మాణిక్యం స్వగృహానికి మంత్రి హరీశ్‌ వెళ్లారు. మాణిక్యం సంగారెడ్డి ఎమ్మెల్యే టికెట్‌ ఆశించగా.. తనకు ఆ సీటు లభించలేదు. దీంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారని మంత్రి బుజ్జగించారు. పార్టీ అధికారంలోకి రాగానే గుర్తింపు కలిగిన నామినేటెడ్‌ పదవి కేటాయించి ఆయనతో పాటు అనుచరులను కాపాడుకుంటామని మంత్రి పేర్కొన్నారు.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Telangana Team

Published : Oct 24, 2023, 7:39 PM IST

Updated : Oct 24, 2023, 7:57 PM IST

Harish Rao Meet Patnam Manikyam in Sangareddy : రానున్న ఎన్నికల్లోని సంగారెడ్డిలో గులాబీ జెండా ఎగుర వేయడమే లక్ష్యంగా ఉన్నామని మంత్రి హరీశ్​రావు అన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలపై హరీశ్‌(Minister Harish Rao) విమర్శలు గుప్పించారు. ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన వ్యక్తి కావాలో.. ఉద్యమ కారుల భుజాలపై తుపాకీ గురిపెట్టినవ్యక్తులు కావాలో ప్రజలే ఆలోచించాలన్నారు. ఉద్యమం సందర్భంగా కిషన్‌ రెడ్డి(Kishan Reddy) పదవికి భయపడి రాజీనామ కూడా చేయలేదని, ఇప్పుడు ఆయనకు అధికారం కట్టబెడితే ఎంత మేరకు అభివృద్ధి చేస్తారో ఆలోచించాలన్నారు.

Minister Harish Rao Comments on Revanth Reddy :కేసీఆర్​ తలచుకుంటే రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని ఓటుకు నోటు కేసులో ఎప్పుడో జైలులో వేసేవారని కానీ పక్క రాష్ట్రాల్లాగా అలాంటి కుటిల రాజకీయాలు చేయబోమని మంత్రి హరీశ్​రావుహితువు పలికారు. ఓటుకు నోటు(Vote for Cash Case)- నోటుకు సీటు అనే వ్యక్తులను ప్రజలు నమ్మె ప్రసక్తే లేదని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో.. ధరణిని బంగాళఖాతంలో కలపాలన్న వారినే ప్రజలు అదే బంగాళాఖాతంలో ముంచుతారని విమర్శించారు. ఎవరు ఎన్ని కుట్రలు, ఆరోపణలు చేసిన రాబోయేది కేసీఆర్‌ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ముచ్చటగా మూడోసారి కూడా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.

"సంగారెడ్డి జిల్లాలో బీఆర్​ఎస్ గెలిచే విధంగా ఎన్నికల ప్రచారంలో ముందుకు సాగుతున్నాం. కేసీఆర్‌కు పనితనం తప్ప పగతనం లేదు. కేసీఆర్ తలచుకుంటే రేవంత్‌రెడ్డిని జైలులో వేసేవారు. ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డిని జైలులో పెట్టేవారు. పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో చూస్తున్నాం కదా?. వాళ్లు గెలవగానే వీళ్లను జైలుకు పంపిస్తారు. వీళ్లు గెలవగానే వాళ్లను జైలుకు పంపిస్తారు. ఎన్ని ట్రిక్​లు చేసినా.. ఇసారి బీఆర్​ఎస్​ హ్యాట్రిక్​ కొడుతుంది." - హరీశ్​రావు, ఆర్థిక శాఖ మంత్రి

Minister Harish Rao Comments :నారాయణఖేడ్ నియోజికవర్గంలో ఈ నెల 30న సీఎం కేసీఆర్ బహిరంగ సభ నేపథ్యంలో కార్యకర్తల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. రేవంత్​రెడ్డి.. వాళ్ల నాన్న చనిపోతే అంత్యక్రియలు చేశాక స్నానం చేయడానికి కరెంట్​ లేదని.. అసెంబ్లీలో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రేవంత్​ తెలుగు దేశం పార్టీలో ఉన్నప్పుడు సోనియా గాంధీని బలి దేవత.. ఇటలీ బొమ్మ అన్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఆమెను దేవత అంటున్నాడని అన్నారు. రేవంత్ నోటికి మొక్కాలని విమర్శించారు. కుర్చీల కోసం పార్టీలు మారే వ్యక్తి రేవంత్ రెడ్డి అని అన్నారు. ఏ ఎండకి ఆ గొడుగు పట్టే రకమని మండిపడ్డారు. బీఆర్​ఎస్​ ఎవరికీ బీటీం కాదని.. ప్రజలకు బీం టీం అని స్పష్టం చేశారు.

Harish Rao Meet Patnam Manikyam కుర్చీల కోసం పార్టీలు మారే వ్యక్తి రేవంత్ రెడ్డి
Last Updated : Oct 24, 2023, 7:57 PM IST

ABOUT THE AUTHOR

...view details