తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆ ఊళ్లో అమ్మాయి పుడితే... పండుగ చేసుకుంటారు'

ఆడపిల్ల అని తెలియగానే.. పసిప్రాణాన్ని కడుపులోనే చిదిమేస్తున్న రోజులివి. ఆ ఊళ్లో మాత్రం ఆడబిడ్డ పుట్టిందంటే ఎగిరి గంతేస్తారు. ఆ శిశువు పుట్టిన రోజున ఊళ్లో ఉత్సవం జరుపుతారు. ఆ పసిప్రాణం భవిష్యత్​కై సుకన్య సమృద్ధి యోజన పథకం కింద ఐదు నెలల డబ్బు జమచేస్తారు.

haridaspur people celebrates a girl child birth in sangareddy district
'ఆ ఊళ్లో అమ్మాయి పుడితే... పండుగ చేసుకుంటారు'

By

Published : Jan 9, 2020, 1:38 PM IST

Updated : Jan 9, 2020, 6:01 PM IST

'ఆ ఊళ్లో అమ్మాయి పుడితే... పండుగ చేసుకుంటారు'

రోజురోజుకు తగ్గిపోతున్న ఆడపిల్లల సంఖ్యను పెంచేందుకు సంగారెడ్డి జిల్లాలోని హరిదాస్​పూర్​ గ్రామస్థులు ఓ వినూత్న కార్యక్రమం చేపట్టారు. కొండాపూర్​ మండలం హరిదాస్​పూర్​ గ్రామంలో 50 మంది బాలురకు, 44 మందే బాలికలు ఉండటాన్ని గ్రామపంచాయతీ గుర్తించింది.

ఆడశిశువుల జననాలు ప్రోత్సహించేందుకు ఓ వినూత్న కార్యక్రమం చేపట్టింది. తమ ఊళ్లో అడపిల్ల పుడితే ఉత్సవం నిర్వహించి, ఆ శిశువు పేరు మీద సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరిచి మొదటి ఐదు నెలలు అందులో డబ్బు పొదుపు చేయాలని తీర్మానం చేసింది.

ఈ నెల ఒకటో తేదీన జన్మించిన శిశువుకు గ్రామస్థులు ఓ ఉత్సవం నిర్వహించారు. పంచాయతీ కార్యాలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించి సంబురాలు చేసుకున్నారు. గ్రామస్థులంతా కలిసి శిశువు తల్లిదండ్రులకు 5 నెలలకు సంబంధించిన చెక్కులు అందజేశారు.

Last Updated : Jan 9, 2020, 6:01 PM IST

ABOUT THE AUTHOR

...view details