భార్యపిల్లలను వేధించాడు... ఉరేసుకున్నాడు
మద్యం మత్తులో భార్య పిల్లలను వేధించి చివరకు ఆత్మహత్య చేసుకున్నాడో ప్రబుద్ధుడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో జరిగింది.
పటాన్చెరులో దారుణం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం మారెల్లికి చెందిన ఆంజనేయులు కుంటుంబంతో సహా వలస వచ్చి పటాన్చెరు గౌతంనగర్ కాలనీలో ఉంటున్నాడు. మద్యానికి బానిసై తాగిన మత్తులో భార్య, పిల్లలను తరచూ కొట్టేవాడు. ఈనెల 15న కూడా మద్యం తాగొచ్చి పెద్ద కూతురితో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. భార్య, పిల్లలు ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లారు. ఈనెల 17న ఇంటికి తిరిగొచ్చిన ఆంజనేయులు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.