పేదరికంలో పుట్టి ఉప ప్రధాని స్థాయికి ఎదిగిన డా.బాబు జగ్జీవన్ రాం జీవితం అందరికి ఆదర్శమని సంగారెడ్డి జిల్లా పాలనాధికారి హనుమంతరావు తెలిపారు. జగ్జీవన్ రాం 112వ జయంతోత్సవ వేడుకలకు కలెక్టర్ హాజరయ్యారు. ఆయన జాతికి చేసిన సేవలను గుర్తుచేశారు. ఆయన చేసిన సంస్కరణలే పాలకులు నేటికి కొనసాగిస్తున్నారని స్పష్టం చేశారు. జగ్జీవన్ ఆశయాలను సాధించే దిశగా పని చేయాలని హనుమంతరావు సూచించారు.
సంగారెడ్డిలో ఘనంగా జగ్జీవన్ రాం జయంతి వేడుకలు - hanmanth rao
సంగారెడ్డిలో ఘనంగా జగ్జీవన్ రాం జయంతి వేడుకలను నిర్వహించారు. ఆయన సేవలను పలువురు వక్తలు కొనియాడారు.
జగ్జీవన్ రాం జయంతి వేడుకలు