Gummadidala MRO Office is Locked : ఇంటి అద్దె చెల్లించడం లేదంటూ తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. గుమ్మడిదల మండలానికి చెందిన చంద్రమణి తన ఇంటిని తహాసీల్దార్ కార్యాలయానికి అద్దెకు ఇచ్చారు. చాలా కాలంగా బకాయి ఉండటంతో డబ్బులు చెల్లించాలని ఆమె అధికారుల చూట్టూ తిరిగారు.
ఎమ్మార్వో ఆఫీసుకు తాళం వేసిన మహిళ.. కారణమేంటంటే..? - Gummadidala MRO Office is Locked due to rent due
Gummadidala MRO Office is Locked : ఇంటి అద్దె చెల్లించడం లేదని విసుగెత్తిపోయిన ఓ యజమాని.. తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేశారు. చాలా కాలంగా అద్దె బకాయి ఉండటంతో డబ్బులు చెల్లించాలని అధికారుల చూట్టూ తిరిగారు. వారు పట్టించుకోకపోవడంలో విసుగు చెందారు. దీంతో కార్యాలయానికి తాళం వేసి ఆమె నిరసన తెలిపిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది.
![ఎమ్మార్వో ఆఫీసుకు తాళం వేసిన మహిళ.. కారణమేంటంటే..? Gummadidala MRO Office is Locked](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16421111-619-16421111-1663656714610.jpg)
Gummadidala MRO Office is Locked
అద్దె చెల్లించడం లేదంటూ తహసీల్దార్ కార్యాలయానికి తాళం
వారు ఎంతకీ చెల్లించకపోవడంతో చంద్రమణి విసుగు చెందారు. వాళ్ల పని పట్టాల్సిందేనని భావించి ఇవాళ ఎమ్మార్వో ఆఫీసుకు ఏకంగా తాళం వేశారు. అద్దె చెల్లించే వరకు తాళం తీయనని తెగేసి చెప్పారు. ఇప్పటి వరకురూ.7,37,000 అద్దె బకాయి ఉన్నట్లు తెలిపారు.