జిల్లాలో శనగల కొనుగోలుకు 6 కేంద్రాలు అందుబాటులోకి తెస్తున్నట్టు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం బచేపల్లిలో కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ప్రతి కేంద్రంలో సబ్బు, నీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. సమావేశంలో సామాజిక దూరం పాటించిన ఆయన... కరోనాను తరిమి కొట్టేందుకు ప్రతి ఒక్కరూ పోరాడాలన్నారు.
పొరుగు రాష్ట్రాల రైతులను అడ్డుకోండి: హరీశ్ - ground nut purchase center opened
సంగారెడ్డి జిల్లా బచేపల్లిలో మంత్రి హరీశ్ రావు శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. జిల్లాలో 6 కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి తేనున్నట్టు తెలిపారు. ప్రతి కేంద్రంలో సబ్బు, నీటి సౌకర్యం కల్పించాలని సూచించారు.
![పొరుగు రాష్ట్రాల రైతులను అడ్డుకోండి: హరీశ్ ground nut purchase center opened in baxhepalli by minister harish rao](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6610945-thumbnail-3x2-asdf.jpg)
పొరుగు రాష్ట్రాల రైతులను అడ్డుకోండి: హరీశ్
అనంతరం నారాయణఖేడ్, జోగిపేట్‌లో అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో 22 వేల ఎకరాల వరి పంట కోయడానికి 200ల వరికోత యంత్రాలు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఖేడ్, సిర్గాపూర్, కల్హేర్లలో జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే రైతులను అడ్డుకొని మన రైతులకు ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.
పొరుగు రాష్ట్రాల రైతులను అడ్డుకోండి: హరీశ్
ఇదీ చూడండి:'మర్కజ్‌కు వెళ్లొచ్చిన ప్రతిఒక్కరూ సమాచారం ఇవ్వాలి'