తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యుత్​ తీగలు తగిలి.. గడ్డితో ఉన్న డీసీఎం దగ్ధం - డీసీఎం దగ్ధం

విద్యుత్ తీగలు తగిలి గడ్డి తీసుకెళ్తున్న డీసీఎం దగ్ధం అయిన ఘటన సంగారెడ్డి జిల్లా అన్నారం గ్రామ పరిధిలో చోటుచేసుకుంది.

grass dcm burned by electric shock in sangareddy
విద్యుత్​ తీగలు తగిలి.. గడ్డితో ఉన్న డీసీఎం దగ్ధం

By

Published : Dec 28, 2019, 1:17 PM IST

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం అండూరు గ్రామ పరిధిలో గడ్డి తీసుకెళ్తున్న డీసీఎంకు విద్యుత్ తీగలు తగలడం వల్ల మంటలు వ్యాపించాయి. దీనితో గడ్డితో పాటు డీసీఎం కూడా పూర్తిగా దగ్ధం అయ్యింది. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడం వల్ల స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

ఘటనాస్థలికి అగ్నిమాపక శకటం సరైన సమయానికి అందుబాటులోకి రాకపోవడం వల్లే డీసీఎం పూర్తిగా కాలిపోయిందని స్థానికులు చెబుతున్నారు. వెంటనే మంటలను ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఉంటే ఈ ప్రమాదం సంభవించేది కాదని అన్నారు.

విద్యుత్​ తీగలు తగిలి.. గడ్డితో ఉన్న డీసీఎం దగ్ధం

ఇవీ చూడండి:'పుర'పోరుపై రేపు రాజకీయ పార్టీలతో ఈసీ సమావేశం

ABOUT THE AUTHOR

...view details