ఆరుపదుల వయసు దాటిన ఈ అవ్వ పేరు బొర్ర నర్సవ్వ. చేర్యాల మండలం చిట్యాల గ్రామం. ఒంటరిగా ఉంటోంది. ఉన్న ఒక్క కొడుకు ఉపాధి కోసం పట్నం వెళ్లి కూలీ చేసుకుంటూ అక్కడే ఉంటున్నాడు. ‘లాక్‌డౌన్’తో ఇంటికి రాలేని పరిస్థితి. గ్రామంలో నిలువ నీడలేక ఇన్నాళ్లు గుడిసెలో నివసించేది.
రెండు నెలలుగా పస్తులు..
ఇటీవల బలమైన ఈదురుగాలులకు గుడిసె కొట్టుకుపోయింది. గుడిసెలో ఉన్న బియ్యంతో పాటు సామగ్రి తడిసి పోయింది. తర్వాత ఆమె తడకలు, సంచులతో మళ్లీ గుడిసె వేసుకుంది. రెక్కాడితే గాని డొక్కనిండని ఆమెకు రేషన్‌కార్డు లేదు. పింఛను రాదు. నిత్యం కూలీ పనులకు వెళ్తేనే కడుపు నిండేది. దాదాపు రెండు నెలలుగా పనులు లేక పస్తులుంటున్న దుస్థితి నెలకొంది.