సంగారెడ్డి కొత్త బస్టాండ్ వద్ద గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నాకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో 'ఛలో ప్రగతి భవన్' అంటూ ర్యాలీ చేపట్టారు. పోలీసులు 29 మంది కార్మికులను, నాయకులను అరెస్ట్ చేశారు. కార్మికుల అరెస్ట్‌ను నిరసిస్తూ సంఘం నాయకులు ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ముఖ్యమంత్రి గతంలో ప్రకటించిన రూ.8,500 వేతనాన్ని ఇంకా అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కారు ఇప్పటికైనా స్పందించి తమ సమస్యలపై దృష్టి సారించాలని కోరారు.
గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించండి - గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించండి
గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డిలో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేపట్టి ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించండి
TAGGED:
grampanchayat workers arrest