తల్లిదండ్రులు పరిశ్రమలో విధులకు వెళ్లి వచ్చేసరికి ఇంటివద్ద ఉన్న కూతురు అదృశ్యమైంది. తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం లక్డారం గ్రామానికి చెందిన కుమ్మరి బాబు, అతని భార్య లక్ష్మమ్మలు రుద్రారం గ్రామంలో ప్రతిభ పరిశ్రమలో పనిచేస్తున్నారు. ఈనెల 13న భార్యా, భర్తలు ఇద్దరూ పరిశ్రమలో విధులకు వెళ్లారు. ఆ సయమంలో ఎనిమిదో తరగతి చదువుతున్న కూతురు అనూష పాఠశాలలకు సెలవు కావడం వల్ల ఇంట్లోనే ఉంది.
ఎనిమిదో తరగతి విద్యార్థిని అదృశ్యం
తల్లిదండ్రులు విధులకు వెళ్లి వచ్చేసరికి ఇంట్లో ఉన్న కూతురు కనిపించకుండా పోయిన ఘటన సంగారెడ్డి జిల్లా లక్డారం గ్రామంలో చోటుచేసుకుంది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఎనిమిదో తరగతి విద్యార్థిని అదృశ్యం
సాయంత్రం వారు పరిశ్రమ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంటికి తాళం వేసి ఉంది. అలాగే వారి కూతురు అనూష కూడా కన్పించలేదు. దీనితో చుట్టుపక్కల, బంధువుల వద్ద విచారించినా విద్యార్థిని జాడ కన్పించలేదు. దీనితో తండ్రి బాబు పటాన్‌చెరు ఠాణాలో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: భూ వివాదంలో రెండు వర్గాల మధ్య రాళ్లదాడి