పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలు కూడా సహకరించాలని జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్లో చేపట్టిన శానిటేషన్ డ్రైవ్‌లో భాగంగా స్థానిక కార్పొరేటర్‌తో కలిసి చెత్త బదిలీ కేంద్రం, మార్కెట్ యార్డ్‌లను ఆమె పరిశీలించారు.
ప్రజలు చెత్తను తమ ఇళ్ల వద్దకు వచ్చే పారిశుద్ధ్య కార్మికులకు మాత్రమే ఇవ్వాలని మేయర్ విజయలక్ష్మి సూచించారు. శానిటేషన్ విభాగంలో ఎస్ఎఫ్ఏల ద్వారా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. చెత్త బదిలీ కేంద్రం వద్ద గల కార్మికులకు మధ్యాహ్నం భోజనం, వేచి ఉండేందుకు షెడ్డు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.