Get Together At Gitam Deemed University In Sangareddy :సంగారెడ్డిలో జిల్లాలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయ(Gitam Deemed University) పూర్వవిద్యార్థులు ప్రస్తుతం చదువు పూర్తిచేసుకుని డిగ్రీ పట్టాలు అందుకోబోతున్న యువతకు దిక్సూచిగా నిలుస్తున్నారు. పూర్వ విద్యార్థులను ఒక చోటుకు చేర్చేందుకు వర్శిటీ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించింది. హోమ్ కమింగ్ పేరిట ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో 2013 నుంచి 2020 వరకు గీతంలో విద్యనభ్యసించిన విద్యార్థులు పాల్గొన్నారు. తరగతి గదుల్లోని మధుర స్మృతులను గుర్తుచేసుకుంటూ అనుభవాలను పంచుకున్నారు. కార్నివాల్ ఫెస్ట్‌లో సందడి చేసి రోజంతా ఆటపాటలతో ఆహ్లాదంగా గడిపారు. దీంతో వర్సిటీ ప్రాంగణం కోలాహలంగా మారింది.
Gitam UniversityIn Sangareddy: గీతం యూనివర్సీటీలోలో చదువుకొని ప్రస్తుతం అదే వర్శిటీలో అధ్యాపకులుగా, ఆచార్యులుగా కొంతమంది పనిచేస్తున్నారు. వారంతా గతస్మృతులను నెమరవేసుకున్నారు. ప్రధానంగా లైబ్రరీ తమ ఉన్నతికి ఎంతో ఉపయోగపడిందని తెలిపారు. ఇక్కడున్న సౌకర్యాలు తమకెంతో ప్రోత్సాహాన్ని ఇచ్చాయని వెల్లడించారు. వర్శిటీలో చదువుతో పాటు అందుబాటులో ఉన్న అన్ని వసతులను విద్యార్థులు ఉపయోగంచుకోవాలని సూచించారు. ప్రస్తుతం చదువు పూర్తి చేసుకోబోతున్న యువతకు మార్గనిర్దేశం చేశారు.
ఘనంగా ఐఐటీ హైదరాబాద్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం
"2005-2007 వరకు గీతంలో ఎమ్మెస్సీ గణితం చేశాను. ఐఐటి ఖరగ్‌పూర్‌లో జూనియర్ ఫెలోషిప్‌గా చేశాను. ఆ తర్వాత ఐఐటీ బెంగళూర్‌లో రీసెర్చర్‌గా పనిచేశాను. 2018లో ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సైనెస్ నుంచి యంగ్ సైంటిస్ట్‌గా అవార్డ్ తీసుకున్నాను. ఇన్ని విజయాలకు కారణం గీతం యూనివర్సిటీ " - పూర్వ విద్యార్ధి
"ఈ యూనివర్సిటీలో చదివి తిరిగి అందులో ఒక ఫ్యాకల్టీగా ఎంపికవ్వడం, ఎంతో మంది విద్యార్థులకు బోధించడం చాలా ఆనందంగా అనిపిస్తోంది. ఆ రోజుల్లో ప్రాథమిక ల్యాబ్ సౌకర్యాలు ఉండేవి కావు. ఏసీ తరగతి గదులు అత్యధునిక ల్యాబ్ వసతులు ఎంతో మెరుగుపడ్డాయి."- పూర్వ విద్యార్థి, అసిస్టెంట్ ప్రొఫెసర్