తెలంగాణ

telangana

ETV Bharat / state

Generic Medical Stores in Sangareddy : సంగారెడ్డి జిల్లావ్యాప్తంగా త్వరలోనే జనరిక్​ ఔషధ దుకాణాలు.. వడివడిగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు

Generic Medical Stores in Sangareddy : మనం ఏ వస్తువు కొన్నా బేరమాడటం మానవ సహజ లక్షణం. అది వేలల్లో కొన్నా.. పదుల్లో కొన్నా.. చివరికి కొత్తి మీర విక్రయించినా బేరసారాలాడక మానం. అలాంటిది ఒక దుకాణంలో మాత్రం బిల్లు ఎంత చెబితే అంత నోరు మెదపకుండా చెల్లించి వస్తాం. అదే మెడికల్‌ షాప్‌. ప్రస్తుతం వాతావరణంలోని మార్పులు, సీజనల్ వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. పేదలనైతే ఆర్థికంగా కుంగదీస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఆధ్వర్యంలో జనరిక్‌ ఔషధాల దుకాణాలను ఏర్పాటు చేసి.. అతి తక్కువ ధరకే విక్రయిస్తూ పేద కుటుంబాలకు అండగా నిలుస్తోంది. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 5 జనరిక్‌ మెడికల్ షాప్​ల ఏర్పాటుకు సర్కార్ సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జనరిక్ మందుల దుకాణం పేదలకు ఆర్థికభారాన్ని తగ్గిస్తుంది.

Generic Medicines in Telangana
Uses of Generic Medicine

By ETV Bharat Telangana Team

Published : Sep 22, 2023, 9:47 PM IST

Generic Medical Stores in Sangareddy : సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా.. ప్రజలకు జనరిక్‌ ఔషధాలను అందుబాటులోకి తీసుకురావాలన్న.. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం ముందుకు సాగుతోంది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో ఈ దుకాణాలను (Generic Medical Shops) ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ఎంపికైన వారికి డీసీసీబీ, ఎస్‌బీఐ ద్వారా రుణాలను ఇచ్చి ప్రోత్సహించనున్నారు. జిల్లాలో 53 సహకార సంఘాలున్నాయి. ఆయా సంఘాల్లో కలిపి 71,000 మంది సభ్యులున్నారు.

ప్రయోగాత్మకంగా జిల్లాలో ఐదు చోట్ల జనరిక్‌ దుకాణాలఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారు. అవి ఇస్మాయిల్‌ఖాన్‌పేట, గుమ్మడిదల, ఝరాసంగం, ఏడాకులపల్లి, ఆందోల్ సహకార సంఘాలు ఉన్నాయి. నిరుపేద కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఎదురయ్యే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. రోజూ కూలీ పనికి వెళ్తేనే జీవనం సాగే పరిస్థితే ఇందుకు కారణం. చికిత్సకు ప్రభుత్వం ఆసుపత్రికి వెళ్లినా.. అక్కడ దొరకని మందులు బయట కొనాల్సి వస్తోంది.

Dr prescription: రోగుల పాలిట శరాఘాతంగా బ్రాండెడ్‌ సిఫార్సులు

Uses of Generic Medicine : ఇదే అదనుగా ప్రైవేట్ మెడికల్‌ దుకాణాదారులు ఎంత చెబితే అంత చెల్లించాల్సిన పరిస్థితి వినియోగదారులకు ఏర్పడుతోంది. ఆర్థిక స్తోమత లేనివారు అప్పులు చేసి మరీ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. జనరిక్‌ ఔషదాల (Generic Medicines) వల్ల తమకు చాలా ఆర్థిక భారం తగ్గుతోందని పేద ప్రజలు చెబుతున్నారు. ప్రైవేట్ మెడికల్ దుకాణాలతో పాటు జనరిక్‌ దుకాణాలు కూడా అందుబాటులోకి రావాలని స్థానికులు కోరుకుంటున్నారు.

"జనరిక్ మందులు చాలా బాగున్నాయి. బయటి ధరతో పోలిస్తే ఇక్కడ ధరలు తక్కువగా ఉన్నాయి. జనరిక్ మెడికల్ దుకాణాలు పెంచాలని కోరుతున్నాం. తద్వారా మాలాంటి వారికి ఉపయోగకరంగా ఉంటుంది."- కొనుగోలుదారులు

బయట మెడికల్‌ షాపుల్లో దొరకని మందులు కూడా.. అతి తక్కువ ధరకే ఇక్కడ దొరుకుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. పట్టణాలతో పాటు అన్నిప్రాంతాల్లో జనరిక్‌ ఔషధాలు వస్తే.. పేదలకు మరింత చేరువలో తక్కువ ధరకే మందులు అందుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ మెడికల్‌ దుకాణాల్లో విక్రయించే మందులతో పాటే.. జనరిక్‌ మందులు కూడా పని చేస్తాయని, ప్రజలు ముందు అపోహల నుంచి బయకు రావాలని సంగారెడ్డి జిల్లా ఆసుపత్రి సూపరింటిండెంట్‌ డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ స్పష్టం చేశారు. ట్యాబ్లెట్స్​లో ఒకే డ్రగ్‌ ఉంటుందని, కంపెనీ పేర్లలో మాత్రమే మార్పులు ఉంటాయి తప్ప రోగనిరోధక శక్తి రెండు ఒకటేనని స్పష్టం చేశారు.

"జనరిక్ మందులు మంచివి. ధర తక్కువగా ఉంటాయి. వేరే ఇతర మందులో ఉండే డ్రగ్ కూడా ఇందులో ఉంటుంది. తద్వారా పేదప్రజల ఆర్థిక భారాన్ని తగ్గించవచ్చు." డాక్టర్‌.అనిల్ కుమార్‌, సూపరింటెండెంట్‌, ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి, సంగారెడ్డి

Low cost Generic Medicine:జనరిక్‌, సాధారణ మందు ధరతో పోల్చుకుంటే 70 శాతం వ్యత్యాసం ఉంటుంది. మిగిలిన అన్ని కంపెనీలు తయారైన ప్రదేశంలోనే జనరిక్‌ మందులు కూడా అదే మాదిరిగా తయారవుతుంది. కానీ అక్కడి నుంచి డైరెక్ట్‌గా రీటైలర్‌కు వస్తాయి అందువల్లే ధర తక్కువుగా ఉంటుందని జనరిక్‌ ఉద్యోగి చెబుతున్నారు. ప్రస్తుతం ప్రజలు జనరిక్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. రానున్న అతి తక్కువ రోజుల్లోనే పట్టణాలతో పాటు గ్రామాల్లో కూడా జనరిక్‌ విస్తరించనుందని ఆయన తెలిపారు.

Pradhan Mantri Jan Aushadhi : దేశంలో 10,500 ప్రభుత్వ మందుల దుకాణాలు.. సామాన్యులకు చాలా చౌకగా..

ఏదేమైనా జనరిక్‌ పేదప్రజలకు ఆర్థికంగా చాలా ఉపశమనాన్ని కలిగిస్తుంది. జనరిక్‌ మందులు రోగాన్ని నయం చేస్తున్నాయి. కాబట్టి ఈ దుకాణాలను మరింతగా ప్రోత్సహిస్తే పేదలకు ఆర్థికంగా ఊరట లభిస్తుంది. ప్రభుత్వాలు కూడా ఈ దుకాణాల ఏర్పాటుకు సహకరించాల్సిన అవసరం ఉంది.

Generic Medicines in Telangana : ప్రచారం చేయక.. అవగాహన లేక.. ఆదరణకు నోచుకోని 'జనరిక్‌'

తక్కువ ధరకే జనరిక్​ మందులు.. నెలవారీ ఖర్చులో భారీ ఆదా

ABOUT THE AUTHOR

...view details