తెలంగాణ

telangana

ETV Bharat / state

Gas Cylinder Blast: పటాన్​చెరులో పేలిన గ్యాస్​ సిలిండర్​.. ముగ్గురికి గాయాలు - telangana latest news

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులో పెద్దశబ్ధంతో గ్యాస్​ సిలిండర్​ (gas cylinder blast at patancheru)పేలింది. పేలుడు తీవ్రతకు ఇంటి గోడలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా.. మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి.

Gas Cylinder Blast
Gas Cylinder Blast

By

Published : Sep 25, 2021, 5:35 AM IST

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో (gas cylinder blast at patancheru) గ్యాస్‌ సిలిండర్​ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా.. ఒకరికి స్వల్పంగా గాయాలయ్యాయి. భవనం పాక్షికంగా దెబ్బతింది.

పటాన్​చెరు గోకుల్​నగర్​లో నాగభూషణం ఇంటి వంట గదిలో గ్యాస్​ (GAS LEAKAGE AT SANGAREDDY DISTRICT)లీకైంది. అతని కుమారుడు సాయికిరణ్​.. తలుపులు తెరిచి లైటు వేశాడు. గ్యాస్​ వాసన వస్తుండడంతో పై అంతస్తులో ఉన్న ప్రవీణ్​కుమార్​ విద్యుత్​ మెయిన్​ ఆఫ్​ చేద్దామని కింద అంతస్తుకు వచ్చాడు. ఇంతలోనే పెద్దశబ్ధంతో గ్యాస్​ సిలిండర్​ పేలింది. పేలుడు ధాటికి ఇంట్లో రెండు గోడలు కూలిపోయాయి. ఈ ఘటనలో ప్రవీణ్​, సాయిచరణ్​లు తీవ్రంగా గాయపడ్డారు. అక్కడే ఉన్న మరో మహిళ స్వల్పంగా గాయపడ్డారు. అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రులను పటాన్​చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం తీవ్రంగా గాయపడిన ప్రవీణ్​కుమార్​ను ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తరలించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలిని పరిశీలించారు. స్థానిక కార్పొరేటర్​ మెట్టుకుమార్​ యాదవ్​ ఘటనా స్థలిని పరిశీలించి.. క్షతగాత్రులను పరామర్శించారు. భవనం పాక్షికంగా దెబ్బతినడంతో నివాసయోగ్యమో కాదో ఇంజినీరింగ్​ అధికారులతో ధ్రువీకరణ చేయిస్తామని తెలిపారు. ఈ ఘటనలో చుట్టుపక్కల ఉన్న ఇళ్ల అద్దాలు కూడా పూర్తిగా ధ్వంసం అయ్యాయి.

Gas Cylinder Blast: పటాన్​చెరులో పేలిన గ్యాస్​ సిలిండర్​.. ముగ్గురికి గాయాలు

ఇదీచూడండి:LIVE VIDEO: సొంత బ్యాండ్​ స్టార్ట్​ చేశాడని చితక్కొట్టారు

ABOUT THE AUTHOR

...view details