తెలంగాణ

telangana

ETV Bharat / state

గోమయ గణేశ్... పర్యావరణానికి భేష్... - వినాయక చవితి

వినాయక చవితి వస్తోందంటే ప్రతి ఒక్కరు పర్యావరణానికి హాని కలగకుండా మట్టి వినాయకులు వినియోగించాలని చెబుతుంటారు. కానీ అమలు చేసే వారు మాత్రం కొందరే. పర్యావరణాన్ని రక్షించడమే గాక... నీటిలో ఆక్సిజన్​ శాతం పెంచి, నీరు కలుషితం కాకుండా ఓ వినూత్న ఆలోచన చేశారు సంగారెడ్డి జిల్లాలోని గోశాల యజమాని. గోవు ప్రాముఖ్యత తెలియజేయడం కోసం.. గోమయంతో గణపయ్య ప్రతిమలు తయారు చేసి విక్రయిస్తున్నారు.

గోమయ గణేశ్... పర్యావరణానికి భేష్...

By

Published : Aug 25, 2019, 3:29 PM IST

Updated : Aug 25, 2019, 4:45 PM IST

గోమయ గణేశ్... పర్యావరణానికి భేష్...

సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్ మండలం బీరంగూడ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున గోశాలలో దాదాపు 800కు పైగా ఆవులను సంరక్షిస్తున్నారు. గణేశ్​ చతుర్థి పురస్కరించుకుని పర్యావరణహిత వినాయక ప్రతిమలు తయారు చేయాలనుకున్నారు గోశాల నిర్వాహకులు. ఆవు పేడలో చెక్క పొడి కలిపి 15 రోజులు ఆరబెట్టి ప్రతిమలకు ప్రకృతి నుంచి తయారు చేసిన రంగులద్ది అందంగా తీర్చిదిద్దుతున్నారు.
గోమయంలో లక్ష్మీదేవి

పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సాయం చేయాలనుకుని గోమయ ప్రతిమలు తయారు చేస్తున్నామని గోశాల అధ్యక్షుడు దామోదర్​రెడ్డి తెలిపారు. ఈ గణపతుల వల్ల నవరాత్రి ఉత్సవాల అనంతరం చెరువులు కలుషితం కాకుండా ఉంటాయన్నారు. గోమయంలో ఉన్న ఆక్సిజన్ మూలంగా ఎంతో ఉపయోగం ఉంటుందని చెబుతున్నారు. గోమయంలో లక్ష్మీదేవీ ఉందని శాస్త్రాలు చెబుతున్నాయని, గోమయంతో చేసిన ప్రతిమ ఏర్పాటు చేసుకుంటే ఇంట్లో లక్ష్మీదేవి కొలువైనట్లేనని నిర్వాహకులు అంటున్నారు.

ఓ వైపు ఆధ్యాత్మికం...మరోవైపు పర్యావరణహితం

పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్న చాలా మంది ఇప్పటివరకు మట్టి ప్రతిమలను తీసుకెళ్లారు. ఈ గోమయ ప్రతిమలలో ఉన్న సుగుణాలు తెలుసుకున్న వారు గణేశ్​ చతుర్థి రోజునే కాకుండా తమ ఇళ్లలో ఉంచుకునేందుకు కొనుగోలు చేస్తున్నారు. ఓ వైపు ఆధ్యాత్మికత మరో వైపు పర్యావరణ పరిరక్షణ ఈ రెండూ వినియోగదారులను గోమయ ప్రతిమలు కొనుగోలు చేసేలా ఆకర్షిస్తున్నాయి.

Last Updated : Aug 25, 2019, 4:45 PM IST

ABOUT THE AUTHOR

...view details