సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం గ్రామ పంచాయతీ పరిధిలోని పార్కును స్థానిక అధికారులతో కలిసి కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు. చెరువు వెంబడి పార్క్‌ను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారని గ్రామ సర్పంచ్‌ను కొనియాడారు. అలాగే ఆడుకునేందుకు ఆట సామాగ్రితో పిల్లల పార్కు కూడా అపురూపంగా రూపుదిద్దారని ఆయన తెలిపారు.
గడ్డిపోతారం గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దారు: కలెక్టర్ - సంగారెడ్డి జిల్లాలోని గడ్డిపోతారం గ్రామాన్ని కలెక్టర్ హనుమంతరావు సందర్శించారు
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశించిన మాదిరిగా సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం పంచాయతీకి అన్నీ అమర్చుకుని ఆదర్శంగా నిలిచారని జిల్లా పాలనాధికారి హనుమంతరావు కొనియాడారు. గ్రామంలోని ప్రతి సౌకర్యాలను ఆయన పరిశీలించారు.
గడ్డిపోతారం గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దారు: కలెక్టర్
సామాజిక బాధ్యత నిధులతో ఎంఎస్ఎన్ సౌజన్యంతో నిర్మించిన వైకుంఠధామం కూడా మంచిగా తయారు చేశారని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ఆశించిన మాదిరిగా గ్రామంలో పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డ్, వైకుంఠధామం, ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ ఇలా గ్రామ పంచాయతీకి సంబంధించిన అన్నీ సమకూర్చారని తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ ప్రకాశంను కలెక్టర్ సత్కరించారు.
ఇదీ చూడండి :భాజపా రాష్ట్ర కమిటీని ప్రకటించిన బండి సంజయ్