తెలంగాణ

telangana

ETV Bharat / state

మున్సిపల్​, పోలీసు​ సిబ్బందికి పండ్ల పంపిణీ - Sangareddy Narayanakhed Fruit Distribution

లాక్​డౌన్​లోనూ నిరంతరం విధులు నిర్వర్తిస్తున్న మున్సిపల్, పోలీసు​ సిబ్బందికి సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​లో బత్తాయిలను పంచారు. పీఆర్​టీయూ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే భూపాల్​రెడ్డి, ఎమ్మెల్సీ రఘోత్తం​ రెడ్డిలు పాల్గొని పండ్లను పంపిణీ చేశారు.

మున్సిపల్​, పోలీసు​ సిబ్బందికి పండ్ల పంపిణీ
మున్సిపల్​, పోలీసు​ సిబ్బందికి పండ్ల పంపిణీ

By

Published : Apr 30, 2020, 6:19 PM IST

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​లో పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డిలు మున్సిపల్, పోలీసు సిబ్బందికి బత్తాయి పండ్లు అందించారు. సగం జీతాలే వస్తున్నా ఇతరులకు సాయమందించేందుకు ఉపాధ్యాయులు ముందుకు రావడం సంతోషమని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు.

ప్రస్తుత కాలంలో 24 గంటలు పనిచేస్తున్న మున్సిపల్, పోలీసు, వైద్య సిబ్బందిని ఆదుకోవడం అందరి కర్తవ్యమని కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘోత్తం​ రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గంలోని మున్సిపల్, పోలీసు, వైద్య సిబ్బందికి ఇంతకుముందు నిత్యావసరాలను అందించామని పీఆర్​టీయూ నేతలు తెలిపారు.

ఇదీ చూడండి:ఇర్ఫాన్​ఖాన్​కు సైకత శిల్పంతో ఘననివాళి

ABOUT THE AUTHOR

...view details