తెలంగాణ

telangana

ETV Bharat / state

మామిడి పండ్ల మాధుర్యం @ సంగారెడ్డి ఫల కేంద్రం - మామిడి పండ్ల మాధుర్యం @ సంగారెడ్డి ఫల కేంద్రం

భంగినపల్లి, తోతాపరి, రసాలు, కళ మామిడి... ఇలా పండ్ల రారాజులు ఎన్ని రకాలో... వేల సంఖ్యలో మామిడి పండ్లు... వందల్లో రకాలు. చూస్తేనే నోరూరిపోతుంది. ఇక అవన్నీ రుచి చూస్తే... ఇక ఎప్పటికీ అక్కడే ఉండిపోతామంటారు మామిడి ప్రియులు. ఇదెక్కడో కాదండి... మన సంగారెడ్డి​లోనే.

చూస్తేనే నోరూరిపోతుంది...

By

Published : May 12, 2019, 8:34 PM IST

చూస్తేనే నోరూరిపోతుంది...
పండ్లలో మామిడికి ఎంత ప్రాముఖ్యత ఉందో... సంగారెడ్డి ఫల పరిశోధన కేంద్రానికి అంతే ప్రాముఖ్యత ఉంది. ఏకంగా 475 రకాలకు పైగా మామిడి పండ్లు ఒకే చోట దొరుకుతాయి. దసేరీ, కలాకాండ్, లంగ్డా, హిమాయత్‌, బేనిషాన్‌, పంచదార, చెరుకు రసాల్‌, నాగిని, మంజీర.. ఇలా వందల రకాలు పండిస్తారు. ఎలాంటి రసాయనాలు లేకుండా సహజ పద్ధతిలో పండ్లను మగ్గబెడతారు.

పొరుగు రాష్ట్రాల నుంచి కూడా...

జిల్లావాసులే కాక... చుట్టూ పక్కల రాష్ట్రాల మామిడి ప్రియులు కూడా వచ్చి ఇక్కడి నుంచి పండ్లు తీసుకెళ్తుంటారు. ప్రియమైన వారికి బహుమతులుగా కూడా ఇస్తుంటారు. తమకిష్టమైన రకాలను తీసుకెళ్లటానికి నగరాల నుంచి ఏటా వేల సంఖ్యలో ప్రజలు వస్తుంటారు.

అరుదైన రకాలు...

అత్యంత అరుదైన ఫలరాజు రకాలు ఇక్కడ లభిస్తాయని.. నిర్వాహకులు చెబుతున్నారు. ఫల పరిశోధన కేంద్రంలో కాసే ప్రతీ పండు ఇక్కడే విక్రయిస్తారు. ఇక్కడ కాయలను మాగబెట్టే విధానంపై ఫల పరిశోధన కేంద్ర శాస్త్రవేత్తల పర్యవేక్షణ ఉంటుంది. ఈ సంవత్సరం నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో దిగుబడి కొద్దిగా తగ్గిందని దుకాణదారులు తెలిపారు.

ధరలు పెరిగాయి...

దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్న ఇక్కడి పండ్లకు ఈసారి ధరలు కొంచెం ఎక్కువగా ఉన్నాయని వినియోగదారులు అంటున్నారు. అయినా సరే... స్వచ్ఛమైన మామిడి పండ్ల రుచి చూడాలంటే తప్పదని మరికొందరంటున్నారు. అయితే ఆలస్యమేందుకు... మామిడి పండ్ల మాధుర్యాన్ని ఆస్వాధించేందుకు మీరూ సంగారెడ్డికి వచ్చేయండి.

ఇవీ చూడండి: అమ్మ ఒక మజిలీ కాదు... జీవిత ప్రయాణం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details