తమకు కేటాయించిన భూములను తిరిగి అప్పగించాలంటూ 95 ఏళ్ల స్వాతంత్య్ర సమరయోధురాలు, ఇతరుల వారసులు సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాలు అందజేశారు. తమకు తెలియకుండానే వాటిని రద్దు చేసినట్లు పదినెలల క్రితం నోటీసులు అందించారని బాధితులు వెల్లడించారు.
'స్వాతంత్య్ర సమరయోధుల భూమిని కేటాయించండి' - భూమి కోసం స్వాతంత్ర్య యోధుల వినతి పత్రం
స్వాతంత్య్రం కోసం పోరాడిన తమ భూములను తిరిగి కేటాయించాలంటూ సంగారెడ్డి కలెక్టరేట్లో వినతి పత్రాలు సమర్పించారు. మెదక్ జిల్లా అల్లాదుర్గ్, టేక్మాల్ మండల వాసులకు కొల్లూరు గ్రామశివారులో ప్రభుత్వం భూములు ఇచ్చిందని తెలిపారు.
భూమికోసం స్వాతంత్ర్య సమరయోధులు
మెదక్ జిల్లా అల్లాదుర్గ్, టేక్మాల్ మండల వాసులకు కొల్లూరులోని సర్వేనంబరు 191లో రెండు ఎకరాల భూమి కేటాయించిందని తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధుల కోటాలో 1996లో మంజూరు చేశారన్నారు. ఇప్పుడు రద్దు చేస్తున్నట్లు నోటీసులు ఇవ్వడం సరికాదని వాపోయారు. తమ భూమిని కేటాయించాలని వారు విజ్ఞప్తి చేశారు.