"కొవిడ్ వ్యాక్సినేషన్‌పై ప్రభుత్వం ఎంత అవగాహన కల్పిస్తున్నా ఇంకా వ్యాక్సిన్ తీసుకోని వారు మిగిలే ఉన్నారు. దాతల సహకారంతో అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కందిలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ రోజు నుంచి ఫిబ్రవరి 4 వరకు.. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. వ్యాక్సిన్ వేసుకున్న వారికి ఉచిత రేషన్‌తో పాటు.. ఎనర్జీ డ్రింక్, ప్రసాదం అందిస్తాం. ఈ కిట్‌లో 13 రకాల ఆహార పదార్థాలు.. పౌష్టికాహారాన్ని అందించేవి పొందుపరిచాం. వ్యాక్సిన్ తీసుకోని వారు ఈ అవకాశాన్ని ఈ వినియోగించుకోవాలి." -- సంగప్ప, అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రతినిధి
కొవిడ్‌పై పోరులో 'అక్షయ పాత్ర ఫౌండేషన్'.. వ్యాక్సిన్ వేయించుకుంటే ఉచిత రేషన్
Free ration if vaccinated by Akshaya Patra Foundation: కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న వారికి అక్షయపాత్ర ఫౌండేషన్ ఉచితంగా సరుకులు పంపిణీ చేస్తోంది. సంగారెడ్డి జిల్లా కందిలో ఉన్న తమ మెఘా కిచెన్ వద్ద అక్షయ పాత్ర ఫౌండేషన్.. ఉచిత వ్యాక్సిన్ కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. అక్కడ టీకా వేయించుకున్న వారికి నిత్యావసరాల కిట్ ఉచితంగా అందిస్తున్నారు. కరోనాపై పోరాటంలో ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు ఈ ప్రయత్నం చేపట్టామంటున్న అక్షయపాత్ర ప్రతినిధితో ఈటీవీ భారత్ ప్రతినిధి క్రాంతికుమార్ ముఖాముఖి.
అక్షయ పాత్ర ఫౌండేషన్, వ్యాక్సిన్ వేసుకుంటే ఫ్రీ రేషన్