తెలంగాణ

telangana

ETV Bharat / state

సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ భూముల పరాధీనంపై చర్యలేవీ? - సుపరిపాలన వేదిక వార్తలు

సర్కారు భూములు ఆక్రమణకు గురైన చర్యలు తీసుకోలేదని పేర్కొంటూ సుపరిపాలన వేదిక గవర్నర్​ దృష్టికి తీసుకొచ్చింది. అనిశా ద్వారా దర్యాప్తు చేసి దోషులను శిక్షించాలని, ఆయా భూములను స్వాధీనం చేసుకోవాలని గవర్నర్​కు లేఖ రాశారు.

forum for good governance
forum for good governance

By

Published : Jan 30, 2022, 10:42 AM IST

ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైనట్లు సాక్షాత్తూ ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం నియమించిన ఎస్కే సిన్హా కమిటీ తేల్చిచెప్పినా కనీస చర్యలు తీసుకోవడం లేదని సుపరిపాలన వేదిక పేర్కొంది. సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన ఆధారాలతో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్​కు వేదిక కార్యదర్శి పద్మనాభరెడ్డి శనివారం లేఖ రాశారు. బాధ్యులైన ఏడుగురు అధికారుల్లో నలుగురు పదవీ విరమణ పొందడంతో చర్యలు తీసుకోవడం సాధ్యం కాదని అధికారులు సమాధానమిచ్చారని ఆయన పేర్కొన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నా మిగిలిన ముగ్గురికి డిప్యూటీ తహసీల్దార్లుగా పదోన్నతి ఇచ్చారన్నారు. అవినీతి నిరోధక శాఖ ద్వారా విచారణ నిర్వహించి దోషులను శిక్షించాలని, భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు మీడియాకు వివరాలను విడుదల చేశారు.

"సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంలోని సర్వే నంబరు 191, 297లలో దాదాపు 200 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. నకిలీ పత్రాలతో పలు కంపెనీల పేరిట ఏడుగురు రెవెన్యూ అధికారులు ఆ భూములకు పట్టాలు జారీ చేశారు. రెవెన్యూ దస్త్రాల్లో యాజమాన్య హక్కులు మార్చారు. నిరభ్యంతర పత్రాలూ జారీచేశారు. ప్రభుత్వ భూముల అన్యాక్రాంతాన్ని తేల్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎస్కే సిన్హా కమిటీ ఈ భూములపైనా విచారణ చేసింది. అక్రమం వాస్తమేనని 2016లో తేల్చింది. ఏడుగురు అధికారుల్లో ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లు, ముగ్గురు తహసీల్దార్లు, ఒక భూమి కొలతల శాఖ సహాయ సంచాలకుడు ఉన్నట్లు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది. ఒక్క అధికారిపైనా ప్రభుత్వం చర్య తీసుకోలేదు. కేవలం ముసాయిదా ఛార్జిషీట్‌ పంపాలని రెవెన్యూశాఖ కోరడంతో.. దాన్ని కలెక్టర్‌ పంపించారు. రూ.వేల కోట్ల విలువ చేసే భూములన్నీ ఇతరుల అధీనంలోనే ఉన్నాయి’’ అని సుపరిపాలన వేదిక వెల్లడించింది.

ఇదీచూడండి:Land Values in TS: బంజారాహిల్స్​లోనే గరిష్ఠం.. చదరపు గజం రూ.1.14 లక్షలు

ABOUT THE AUTHOR

...view details