Former MLA Jagga Reddy Press Note Release : "ఒక బలవంతుడు భూమి మీద ఎప్పటికీ బలవంతుడిగా ఉండలేడు. కొన్ని సంవత్సరాలు మాత్రమే బలవంతుడిగా ఉంటాడు. అతడు ఏదో ఒక రోజు బలహీనుడు కాక తప్పదు. అది ఏ వ్యవస్థలోనైనా, వ్యాపారం, రాజకీయం ఏ రంగంలోనైనా అంతే. అలాగే బలహీనులు ఎప్పటికీ బలహీనులుగా ఉండరు." అంటూ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి(Jagga Reddy) ఒక పత్రిక ప్రకటనను విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి, ప్రజలకు ఈ ప్రకటన ద్వారా ఆయన ఒక సందేశాన్ని పంపించారు.
'బలవంతుడి సమయం గడిచే వరకు బలహీనుడు మౌనంగానే ఉంటాడు. ఆ మౌనం బలహీనుడి బలహీనత కాదు. బలహీనుడు తన టైం కోసంఎదురుచూస్తూ ఉంటాడు. కాలం చేసే నిర్ణయంలో బలహీనుడు ఒకరోజు బలవంతుడు అవుతాడు. మనిషి జీవితం యవ్వనం నుంచి ముసలితనం వరకు ఎలాగైతే సాగుతుందో అలాగే ఈ బలవంతుడు బలహీనుడి కథ కూడా అంతే. ఒక నాయకుడి గెలుపు, ప్రజలను పరిపాలించే సమయం. ఒక నాయకుడి ఓటమి, గత పరిపాలనలో ఉన్న లోపాలు. ఆ లోపాలను సమీక్షించుకొని భవిష్యత్తులో విజయాలు సాధించడానికి ముందడగు వేసే సమయం అంటూ' సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు.
MLA Jagga Reddy Latest News :తాను 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అందులో 3 సార్లు సంగారెడ్డి ప్రజలు తనను గెలిపించుకున్నారని జగ్గారెడ్డిగా తెలిపారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా మంచి పరిపాలన చేశానని చెప్పారు. మొదటిసారి 2014లో ఓడిపోయినా, ఆ ఓటమి తనకు చాలా అనుభవాలు నేర్పిందని వెల్లడించారు. అలాగే ఇప్పుడు 2023 శాసనసభ ఎన్నికల్లో(Telangana Elections 2023) రెండోసారి ఓడిపోయానన్న జగ్గారెడ్డి, ఈ పది రోజుల్లోనే చాలా అనుభవాలు నేర్చుకున్నానంటూ పేర్కొన్నారు.
ఎన్నికల్లో ఓడినవారికి పదవుల్లేవ్ - ఏడాది పాటు వేచి చూడాల్సిందే